జమిలి: రామ్ మాధవ్ కు నారా లోకేష్ ఘాటు రిప్లై

Nara Lokesh replies to Ram Madhav
Highlights

జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ప్రతిపాదనపై చర్చలకు శ్రీకారం చుట్టారు. మమతా బెనర్జీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే, రామ్ మాధవ్ దానికి ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ కు నారా లోకేష్ మరో ట్విస్ట్ ఇస్తూ ట్వీట్ చేశారు. 

విజయవాడ: బిజెపి నాయకుడు రామ్ మాధవ్ ట్వీట్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఘాటుగా సమాధానం చెప్పారు. ముందస్తు ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు అంగీకరించకపోవడమే మోడీకి ప్రజాదరణ పెరిగిందని అనడానికి నిదర్శనమని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ కు నారా లోకేష్ ధీటుగా ట్విట్టర్ లో స్పందించారు.  కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురైన బీజేపీకి ఆ తరువాత దేశ వ్యాప్తంగా జరిగిన అన్ని ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిందని లోకేష్ అన్నారు. 

అందుకే ఇప్పుడు ముందస్తు ఎన్నికలంటూ తొందర పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇదేనా మోడీ ప్రజాదరణ అని ఆయన ప్రశ్నించారు. 
 
జమిలి ఎన్నికలకు వెళ్లాలనే కేంద్ర ప్రతిపాదనను తృణమూల్ కాంగ్రెసుతో సహా ఇతర ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. 

loader