కర్నూలు: ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. టీడీపీ కీలక నేత శేఖర్ రెడ్డి దారుణ హత్యకు గురవ్వడం కర్నూలు జిల్లాలో ఆందోళన నెలకొంది. 

శేఖర్ రెడ్డి హత్యపై ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. శేఖర్ రెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందంటూ ట్వీట్ చేశారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవికచర్య అమానుషమన్నారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు నారా లోకేష్. 

ఇకపోతే శేఖర్ రెడ్డి హత్య రాజకీయ కోణంలో జరగలేదని ఆ జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేశారు. భూ తగాదాలే శేఖర్ రెడ్డి హత్యకు కారణమని మీడియాకు తెలియజేసిన సంగతి తెలిసిందే.