టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫోన్ చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో పాటు కాకినాడలో పార్టీ కాపు నేతలు రహస్యంగా సమావేశం కావడం, తదితర పరిణామాలపై లోకేశ్ ఆరా తీశారు.

కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. అంతకు ముందు వారు టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజీపీలో విలీనం చేయాల్సిందిగా కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ అందజేశారు.