Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థుల పాలిట కంసుడిగా మారిన జ‌గ‌న్‌రెడ్డి... నారా లోకేష్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యార్థుల పాలిట జ‌గ‌న్‌రెడ్డి కంసుడు అని తేలిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ద‌శ‌లో కేంద్రం, దాదాపు అన్ని రాష్ట్రాలూ ప‌రీక్ష‌లు ర‌ద్దు, వాయిదా వేస్తే, ఒక్క ఏపీలోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని మొండిగా ముందుకెళ్ల‌డం జ‌గ‌న్‌రెడ్డి మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌నమని విరుచుకుపడ్డారు.

nara lokesh fires on ys jagan over 10th, inter exams in AP - bsb
Author
Hyderabad, First Published Apr 28, 2021, 1:50 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యార్థుల పాలిట జ‌గ‌న్‌రెడ్డి కంసుడు అని తేలిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ద‌శ‌లో కేంద్రం, దాదాపు అన్ని రాష్ట్రాలూ ప‌రీక్ష‌లు ర‌ద్దు, వాయిదా వేస్తే, ఒక్క ఏపీలోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని మొండిగా ముందుకెళ్ల‌డం జ‌గ‌న్‌రెడ్డి మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌నమని విరుచుకుపడ్డారు.

విద్యార్థుల భ‌విష్య‌త్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జ‌గ‌న్‌రెడ్డి అధ్వాన‌పాల‌న‌లో వారు బ‌తికి ఉంటే  క‌దా భ‌విష్య‌త్తు? అని ఎద్దేవా చేశారు. అంబులెన్సులు రావు, ఆక్సిజ‌న్ లేదు. జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

క‌రోనా శ‌వాల‌తో మార్చురీలు నిండిపోయాయి, అంత్య‌క్రియ‌ల‌కు శ్మ‌శానాల‌లో క్యూలు కడుతున్నారు. ఆస్ప‌త్రిలో బెడ్డు దొర‌క్క‌ రోడ్డుపైనే కుప్ప‌కూలిపోతున్నారు. అయినా
ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ప‌రీక్ష‌ల పేరుతో 15 ల‌క్ష‌ల‌మందికి పైగా విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌టం ఫ్యాక్ష‌న్ సీఎంకి త‌గ‌దు అంటూ హితవు పలికారు. 

ఇదిలా ఉండగా టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం నేను ఆలోచిస్తా అంటూ సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారన్నారు.

టెన్త్ పరీక్షలపై వెనక్కి తగ్గని వైఎస్ జగన్: భవిష్యత్తుకు నష్టమని వాదన...

అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుందని అన్నారు. 

టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం. కోవిద్‍పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తాం. టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‍కే నష్టం. విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు అన్నారు. 

పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్ అని ఇస్తే.. భవిష్యత్‍లో విద్యార్థులు నష్టపోతారని చెప్పుకొచ్చారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని ఈ సందర్భంగా  సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona
 

Follow Us:
Download App:
  • android
  • ios