Asianet News TeluguAsianet News Telugu

మహిళల ఫోన్లలోనే కాదట... దిశ యాప్ పేరుతో ఏదో జరుగుతోంది..: నారా లోకేష్ అనుమానం (వీడియో)

దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని పోలీసులు పురుషులను కూడా బలవంతం చేస్తున్నారని... మాటవినని వారిపై దాడికి పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోపై లోకేష్ స్పందించారు. 

Nara Lokesh doubted on Disha App AKP
Author
First Published Nov 8, 2023, 12:39 PM IST

హైదరాబాద్ : వైసిపి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ ను మహిళల ఫోన్లలోనే కాకుండా పురుషుల ఫోన్లనో పోలీసులు బలవంతంగా డౌన్ లోడ్ చేయిస్తున్నారట. దీంతో ఈ యాప్ పై ప్రతిపక్ష టిడిపి అనుమానం వ్యక్తం చేస్తోంది. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన ఈ దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనుమానం వ్యక్తం చేసారు.  

మహిళల రక్షణ కోసం తెచ్చిన దిశా చట్టంకు దిక్కు మొక్కూ లేదని లోకేష్ అన్నారు. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయన్నారు. జగనాసుర పాలనలో మహిళలు బిక్కుబిక్కు మంటూ బ్రతకాల్సిన పరిస్థితి వుందున్నారు. అలాంటి మహిళలు తమ ఫోన్లలో దిశ యాప్ వేసుకునేలా చూడాలి... అంతేగానీ పురుషులను కూడా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఒత్తిడి చేయడం దారుణమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Read More  ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలుచేసింది మన పున్నమ్మే... సర్వనాశనం చేశావుకదమ్మా!: విజయసాయి రెడ్డి

అనకాపల్లి జిల్లా రేగుపాలెంకు చెందిన భారత ఆర్మీ ఉద్యోగి సయ్యద్ అలీముల్లాతో పోలీసులు వ్యవహరించిన తీరును లోకేష్ తప్పుబట్టారు. ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన సయ్యద్ ను ఫోన్ లో దిశ యాప్ వేసుకోవాలని పోలీసులు ఒత్తిడిచేసారని... దీనిపై అతడు అనుమానం వ్యక్తంచేయగా పోలీసులే గూండాల్లా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారని లోకేష్ తెలిపారు. 

పోలీసులు ఓ సైనికుడితో ఇంత దారుణంగానా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడకి స్వరాష్ట్రంలో దక్కే గౌరవమీదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. దిశ యాప్ తో మహిళకు రక్షణ దక్కుతుందో లేదో తెలీదు... కానీ ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోకుంటే చివరకు సైనికుడి ప్రాణాలకు రక్షణ లేదని అర్థమవుతోంది... ఇదీ ప్రస్తుతం ఏపీలో దుస్థితి అంటూ లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios