గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహరంలో జనసేన కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడిని మంత్రి నారా లోకేశ్ ఖండించారు.

గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహరంలో జనసేన కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడిని మంత్రి నారా లోకేశ్ ఖండించారు.

‘‘వై ఛీ పీ’’ మూకలు గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా..!! మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటు’’ అంటూ ట్వీట్ చేశారు.

గుంటూరు పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తోట చంద్రశేఖర్ ప్రచార రథాలపై కొందరు వ్యక్తులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు జనసేన మహిళా కార్యకర్తలు గాయపడ్డారు.

వెంటనే స్పందించిన తోటి కార్యకర్తలు వారిని జీజీహెచ్‌కు తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే తమ ప్రచార రథాలపై రాళ్లదాడికి పాల్పడ్డారంటూ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Scroll to load tweet…

జనసేన ప్రచార రథాలపై రాళ్లదాడి, పలువురికి గాయాలు: వైసీపీ కార్యకర్తలేనంటూ పోలీసులకు ఫిర్యాదు