Asianet News TeluguAsianet News Telugu

దళితులకు...చంద్రబాబు విదేశీ విద్య- జగన్ స్వదేశీ శిరోముండనం: నారా లోకేష్

మాజీ సీఎం చంద్రబాబు పాలనలో దళితులకు విదేశీ విద్య అందిస్తే ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి పాలనలో దళితులకు స్వదేశీ శిరోముండనం చేశారని లోకేష్ ఆరోపించారు. 

Nara Lokesh compairs chandrababu, jagan governance
Author
Guntur, First Published Sep 11, 2020, 8:27 PM IST

గుంటూరు: వైసిపి ప్రభత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువయ్యాయని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబు పాలనలో దళితులకు విదేశీ విద్య అందిస్తే ప్రస్తుత సీఎం జగన్ రెడ్డి పాలనలో దళితులకు స్వదేశీ శిరోముండనం చేశారని లోకేష్ ఆరోపించారు. 

''దళితులపై జగన్ రెడ్డి దమనకాండ కి అంతే లేదా? వైకాపా పాలనలో దళిత జాతి పై వారానికో దాడి,నెలకో శిరోముండనం, మూడు నెలలకో హత్య. దళితులపై పిచ్చోళ్లనే ముద్ర, శిరోముండనం, కొట్టి చంపడం, నిప్పంటించడం ఎప్పుడైనా జరిగాయా?దళితులను ఇంత ఘోరంగా అవమానించిన పాలకుడు జగన్ రెడ్డి గారు ఒక్కడే'' ట్విట్టర్ వేదికన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 

read more   అంతర్వేది రధానికి నిప్పుపెట్టిన..ఆ పిచ్చోడు విజయసాయే?: మాజీ మంత్రి సంచలనం

ఇక కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కరోనా కేసులు పెరుగుదలపై మమ్మల్ని నిందించడం ఏంటని ప్రశ్నించిన గిరిజన అధికారిపై చర్యలు తీసుకోవడం దారుణమని లోకేష్ అన్నారు. గిరిజన అధికారిపై జగన్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యకాండకు దిగిందన్నారు. 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనాపై జరిగిన సమీక్షా సమావేశంలో నాదెండ్ల వైద్యాధికారి సోమ్లూ నాయక్ ని చులకన చేసి మాట్లాడటమే కాకుండా అరెస్ట్ చెయ్యడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన గిరిజన అధికారిపై వైకాపా ప్రభుత్వం జులుం ప్రదర్శించడం ఘోరమన్నారు. 

''గతంలో మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ పై పిచ్చివాడనే ముద్ర వేసారు. ఇప్పుడు గిరిజన అధికారిని దౌర్జన్యంగా అరెస్ట్ చేసారు.  కరోనా వ్యాప్తికి కారణం అయిన వైకాపా ఎమ్మెల్యేలు, కరోనా పెద్ద విషయం కాదన్న జగన్ రెడ్డి పై చర్యలు తీసుకోకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్య సిబ్బందిని వేధిస్తున్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన సోమ్లూ నాయక్ ని విడుదల చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios