Asianet News TeluguAsianet News Telugu

అంతర్వేది రధానికి నిప్పుపెట్టిన..ఆ పిచ్చోడు విజయసాయే?: మాజీ మంత్రి సంచలనం

అంతర్వేది రధం దగ్దం కుట్ర చంద్రబాబుదే అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ గట్టిగా కౌంటరిచ్చారు. 

antarvedi temple chariot fire accident... jawahar serious comments on mp vijayasai reddy
Author
Guntur, First Published Sep 11, 2020, 7:47 PM IST

విశాఖపట్నం: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్దం ఏపి రాజకీయాల్లో వేడిని పెంచింది. ఈ ఘటనకు మీరంటే మీరు కారణమని అదికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిజానిజాలు తేల్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిబిఐ విచారణకు ఆదేశించారు. అయితే ఈ రధం దగ్దం కుట్ర చంద్రబాబుదే అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ గట్టిగా కౌంటరిచ్చారు. 

 

''రధానికి నిప్పు పెట్టింది పిచ్చోడని చెప్పింది ప్రభుత్వం,ఆ పిచ్చోడి కోసం పోలీసులు వెతుకుతున్నారని విన్నా. విజయసాయి రెడ్డి మాటలు చూస్తుంటే, ఆ పిచ్చోడు ఆయనే అనిపిస్తుంది. డీజీపీ గారు విసారెడ్డిని పట్టుకెళ్ళి, లై డిటెక్టర్ పరీక్షలు చెయ్యండి. ఈ రధం తగలు పెట్టిన వారితో పాటు లక్ష కోట్లు దోచి ఎక్కడ దాచింది, గత 16 నెలల్లో జే-టాక్స్ రూపంలో ఎంత నొక్కింది కూడా బయటకు వస్తుంది'' అంటూ ట్విట్టర్ వేదికన జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

read more  స్వర్ణ ప్యాలెస్ పై నోరు మెదపలేదు, అంతర్వేదిపై స్పందించారు: బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

''రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఉపేక్షించేది లేదు. వర్గ వైషమ్యాలు సృష్టించాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంతర్వేది ఘటనలో దోషులు  ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు. కొత్త రథం తయారీకి రూ.95 లక్షలు మంజూరు చేసింది జగన్ గారి సర్కార్. నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోంది'' అంటూ  విజయసాయి పేర్కొన్నారు.

''తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు'' అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ కే జవహర్ కౌంటర్ ఇచ్చారు.

''అందర్వేది ఆలయ రథం దగ్ధంపై గంటల వ్యవధిలోనే నిజ నిర్ధారణ కమిటీ వేశారు చంద్రబాబు గారు. స్వర్ణ ప్యాలేస్ అగ్నిప్రమాదంలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పేతే కనీసం నోరు కూడా మెదపలేదెందుకని ప్రజలు అడుగుతున్నారు. రమేశ్ హాస్పిటల్స్ పై ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పి కాపాడాడు'' అంటూ విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios