జీవీఎల్ నర్సింహారావుపై నారా లోకేష్ సెటైర్లు

Nara Lokesh challenges GVL
Highlights

బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆయన ట్విట్టర్ వేదికగా జీవిఎల్ ను సవాల్ చేశారు. 

అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆయన ట్విట్టర్ వేదికగా జీవిఎల్ ను సవాల్ చేశారు. 

కేంద్రమంత్రి దగ్గరకు బ్రోకర్‌ను పంపానంటున్న జీవీఎల్... ఆ కేంద్రమంత్రి పేరు, బ్రోకర్‌ పేరును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అబద్ధాలను నిజమని నమ్మించే రకమని జీవీఎల్‌పై విరుచుకుపడ్డారు. 

ఢిల్లీలో లాబీయింగ్ అంటూ మరో కట్టుకథ ప్రారంభించారని విమర్శించారు. అసత్యాలను ప్రచారం చేయడం బీజేపీ నేతలకు జబ్బుగా మారిందని లోకేశ్ ఎద్దేవా చేశారు.

loader