Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్, వైసీసీ నేతలకు నారా లోకేష్ చాలెంజ్.. 24 గంటల డెడ్ లైన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాలు విసిరారు.

Nara Lokesh Challenge To YS Jagan over APSDC Allegations
Author
First Published Dec 6, 2022, 11:38 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాలు విసిరారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను రాబోయే 24 గంటల్లో బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. ఈ మేరకు నారా లోకేష్ ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. #APSDCChallenge, #24hrChallengeToJagan హ్యాష్ ట్యాగ్‌లను కూడా లోకేష్ తన పోస్టుకు జతచేశారు. 

‘‘వైఎస్ జగన్‌తో పాటు ఆయన వెంట ఉన్నవారికి నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికే 3 సంవత్సరాల 8 నెలలు పూర్తి అయింది. నేను లేదా మా పార్టీ అధ్యక్షుడు అవినీతికి పాల్పడ్డారో లేదో తెలుసుకోవడానికి మీరు చేయని విచారణ లేదు. మేము మీలాంటి వాళ్లమని మీరు అనుకున్నారు. మా ఆఫీసుల్లో ఒక్క అవినీతి కూడా జరగలేదన్న నిజం మీరు తెలుసుకున్నారు. మీలోని అవినీతి ఆత్మకు ఇది తప్పక షాక్ ఇచ్చి ఉంటుంది. 

 


ఇన్సైడర్ ట్రేడింగ్ , ఫైబర్ గ్రిడ్, ఐటి కంపెనీలు రాయితీలు, అనేక ఇతర విషయాల్లో నాపై అవినీతి ఆరోపణలు చేశారు. అవన్నీ అసత్యాలు అని తేలింది. చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా కోర్టు కొట్టేసింది. అక్కడ ఏ తప్పు చర్య కనుగొనబడలేదు. నిరాశలో ఉన్న మీరు ఇప్పుడు పీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌‌ను తీసుకువచ్చారు. మునుపటిలాగా మళ్లీ నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. 

రాబోయే 24 గంటల్లో సాక్ష్యాలను బహిర్గతం చేయమని నేను మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. నా ప్రతిష్టను దిగజార్చడానికి ఈ బూటకపు, నిరాధారమైన ఆరోపణలు చేయడం కంటే బహిరంగంగా నాతో పోరాడటానికి మీరు తగిన వ్యక్తి అని నిరూపించండి’’ అని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios