కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతుండటంతో పాటు అనేక ప్రాంతాల్లో ఉట్టి కొట్టే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రముఖ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటున్నారు. కృష్ణుడి పుట్టినరోజు పురస్కరించుకుని.. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమారుడిని కృష్ణుడిలాగా అలంకరించి మురిసిపోతున్నారు.

దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్‌ను కూడా అలాగే ముస్తాబు చేశారు లోకేశ్-బ్రాహ్మాణీ. కుండలోంచి వెన్న దొంగతనం చేస్తున్న గోపాలుడిలా దేవాన్ష్ ముద్దుగా ఉన్నాడు.

చిన్నారి ఫోటోలు షేర్ చేస్తూ.. ‘‘ గిరిన సైతం గోటితో లేపినా.. తులసీ దళానికే తేలిపోయాడట.. ఆయుధం పట్టలేదు కానీ అసుర సంహారం ఆపలేదట!! అందరికీ ఆదర్శప్రాయమైన ఆ కృష్ణ భగవానుడిని స్మరిస్తూ.. తెలుగు ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు ’’ అంటూ నారా లోకేశ్ ట్వీట్  చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండ్ అవుతోంది. తెలుగుదేశం అభిమానులు ఈ బుల్లి కృష్ణుడిని చూసి తెగ సంబరపడిపోతున్నారు. దేవాన్ష్ ఫోటోలను విరీతంగా షేర్ చేస్తున్నారు.