చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులు  చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, నందమూరి కుటుంబసభ్యులు నారావారిపల్లెకు చేరుకొన్నారు.

ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని తన స్వగ్రామం నారావారిపల్లెలో చంద్రబాబునాయుడు జరుపుకొంటున్నారు. ఇప్పటికే నారా, నందమూరి కుటుంబాలు ఈ గ్రామానికి చేరుకొంటున్నారు. 

ఆదివారం నాడు ఉదయం లోకేష్ గ్రామానికి చేరుకొన్నారు. సోమవారం నాడు చంద్రబాబునాయుడు నారావారిపల్లెకు వస్తారు. ఆదివారం నాడు గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు భువనేశ్వరి, బ్రహ్మణి బహుమతులను అందించారు. 

మంగళవారం నాడు చంద్రబాబునాయుడుతో పాటు బంధుమిత్రులు ఖర్జూరనాయుడు దంపతులకు నివాళులర్పిస్తారు.