Asianet News TeluguAsianet News Telugu

Chandrababu: "మూడు నెలల్లో జగన్ ప్రభుత్వం క్లీన్ బౌల్డ్"

Chandrababu: మూడు నెలల్లో జగన్ ప్రభుత్వం క్లీన్ బౌల్డ్ అవ్వడం ఖాయమని, మ‌రో మూడు నెలల్లో అమ‌రావ‌తే రాజ‌ధాని అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో రా క‌ద‌లిరా రా సభ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. 

Nara Chandrababu Naidu Public Meeting at Achanta KRJ
Author
First Published Jan 8, 2024, 5:19 AM IST

Chandrababu: మూడు నెలల్లో అమరావతే రాజధాని...ఇది తథ్యమని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో రా క‌ద‌లిరా రా సభ‌లో ప్ర‌సంగిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బాబాయి హత్యలో చెల్లిపై కేసు పెట్టడమే జగన్ విశ్వసనీయత అనీ, మద్య నిషేధం అని చెప్పి....మద్యంపై అప్పు తేవడమేనా విశ్వసనీయత అని ప్రశ్నించారు.  

సిపిఎస్ రద్దు అని...జీతాలు కూడా ఇవ్వకపోవడమేనా విశ్వసనీయత అని నిలదీశాడు. మూడు నెలల్లో జగన్ ప్రభుత్వం క్లీన్ బౌల్డ్ అవ్వడం ఖాయమని,  జగనన్న వదిలిన బాణం షర్మిల...ఇప్పుడు జగన్ వైపు తిరిగిందని అన్నారు. అసమర్థ, అవినీతి మంత్రులతో జగన్ క్యాబినెట్ ఉందనీ,  వైసీపీలో బూతు రత్నలకు, బూతు సామ్రాట్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు.

2014లో 15కి 15 అసెంబ్లీలు, 3కి 3పార్లమెంటులు గెలిపించారని.. రానున్న ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేనల జైత్రయాత్రను ఇక్కడినుండే ప్రారంభించబోతున్నామ‌ని వెల్లడించారు. టీడీపీ, జనసేన అంటే అత్యంత అభిమానం వారు పశ్చిమగోదావరిజిల్లా ప్రజలు. అని.. మొట్టమొదటిసారిగా ఒకేఒకసారి 2019లో తప్పటడుగు వేశారని తెలిపారు.

ఈ 4.9సంవత్సరాల్లో వైసీపీ పని అయిపోయిందనీ,  వైసీపీ బ్యాచ్ మొత్తం త్వరలోనే ఇళ్లకు పోతారని జ్యోసం తెలిపారు. వైసీపీ పాలనలో సమాజంలో ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? మీ జీవితాల్లో మార్పు వచ్చిందా? మీ ఆదాయం పెరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి ప్రతిరోజు మాయమాటలు  చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోసం చేసిన పార్టీని రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేయడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? అని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అన్నారు. టీడీపీ బహిరంగ సభకు స్థలం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనీ, ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చ‌రించారు. తాము తలచుకుంటే.. మీరు అసలు వ్యాపారాలు చేయలేరని హెచ్చ‌రించారు. 

పశ్చిమగోదావరిజిల్లా ఆక్వారంగానికి నెలవు...పెద్దఎత్తున ఆక్వా పంట ఉందని అన్నారు. జగన్ పాలనలో ఆక్వారంగం ధ్వంసమైందనీ,  తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమగోదావరిలో ఆక్వారంగానికి పెద్దపీట వేశాననీ, రాయలసీమలో హార్టీకల్చర్ ను ప్రోత్సహించి లాభాలు వచ్చేలా చేశానని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో రైతులు నానా పాట్లు పడ్డారనీ, కనీసం పంట అమ్ముకునేందుకు గోనె సంచులు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో కౌలురైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 2వ స్థానంలో ఉందనీ, రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో ఉందని,  తాము అధికారంలోకి వచ్చాక రైతు రాజ్యాన్ని తెస్తామ‌ని…రైతులకు అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios