నాలో సగం... నా ప్రాణం..: సీఎం సీటులో చంద్రబాబును చూసి భువనేశ్వరి ఎమోషనల్

నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే కొన్నిరోజులకు ముందు జైలు గోడల మధ్య చూసిన భర్తను ఇప్పుడు సీఎం సీటులో చూసి నారా భువనేశ్వరి ఎమోషన్ అయ్యారు... 

Nara Bhuvaneshwari's Emotional comments on Chandrababu AKP

అమరావతి : భర్తను జైల్లో వేసారు... కొడుకును కూడా అరెస్ట్ చేయడానికి సిద్దమయ్యారు. కానీ ఆమె ఏమాత్రం భయపడలేదు. తన భర్త తప్పు చేయలేదు... రాజకీయం కక్షసాధింపులో భాగంగానే ఆయనను జైల్లో పెట్టారని ప్రజలకు వివరించారు. ఇలా భర్త కోసం వీరనారిలా పోరాటం చేసిన ఆమె ఎవరో కాదు నారా భువనేశ్వరి. కట్టుకున్న భర్త కోసం ఆమె చేసిన పోరాటం కూడా తాజా ఎన్నికల్లో టిడిపికి ప్లస్ అయ్యింది. దీంతో మరోసారి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.

గతంలో భర్తను జైలు గోడలమధ్య బంధీగా చూసిన భువనేశ్వరి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సీటుపై చూసి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న పోటోను జతచేసి ఎమోషనల్ ట్వీట్ చేసారు. ''ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం, నా ప్రాణం నారా చంద్రబాబు నాయుడు గారు'' అంటూ భర్తపై వున్న ప్రేమను రెండు మాటల్లో వ్యక్తంచేసారు. 

 

ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మెగా డిఎస్సి (16,347 టీచర్ పోస్టులు) భర్తీ ఫైలుపై తొలి సంతకం చేసారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, ఫించన్ డబ్బుల పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటిన్ల పునరుద్దరపై నాలుగో సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేసారు. 

ఇలా చంద్రబాబు బాధ్యతల స్వీకరించగానే రాష్ట్ర ప్రగతి-ప్రజా సంక్షేమం ప్రారంభించారని... అందుకోసమే ఐదు ఫైళ్లపై సంతకం చేసి సంకేతం ఇచ్చారని భువనేశ్వరి పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజా పాలన అందించేందుకు సిద్దమయ్యారంటూ భువనేశ్వరి భర్త చంద్రబాబు నిర్ణయాలను కొనియాడారు. 
    


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios