చంద్రబాబు బెయిల్ పై నారా భువనేశ్వరి స్పందన ఇదే!
Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మధ్యంతర బెయిల్ లభించింది. ఇవాళ ఏపీ హైకోర్టు చంద్రబాబుకు 5 షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ తరుణంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి స్పందించారు.

Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. అనార్యోగ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పార్టీ శ్రేణుల్లో సంబంరాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) స్పందించారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడంతో తానే కాదు.. ప్రజలందరూ సంతోషిస్తున్నారని అన్నారు.
ఇవాళ చంద్రబాబుకు బెయిల్ వచ్చిందంటే.. ఆయనొక్కరే ఈ పోరాటంలో గెలిచారనీ కాదనీ, ఆయన కుటుంబం మాత్రమే గెలిచిందని కాదనీ, ఈ న్యాయ పోరాటంలో ప్రజలందరూ గెలిచారని అన్నారు. ఇది మహిళా శక్తి గెలుపు అని, వాళ్లందరికీ తరఫున, తన కుటుంబం తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. న్యాయం గెలవాలి యాత్ర కొనసాగించాలా వద్దా? లేదా? అనేది ఇంకా ఆలోచించలేదని, ముందు తన చంద్రబాబును చూడాలని భువనేశ్వరి పేర్కొన్నారు .
అంతకు ముందు విజయనగరంలో రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు బెయిల్ పై బయటకు రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో తాను ముందు చంద్రబాబును చూడాలన్న భువనేశ్వరి రాజమండ్రి జైలుకు చేరుకున్నారు.