ప్రశాంతంగా కొనసాగుతున్న నంద్యాల ఉప ఎన్నిక. ఇప్పటి వరకు 40 శాతానికి పైగా పోలింగ్.

నంద్యాల ఉపఎన్నికలో పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. ఓంటి గంట వరకు 50శాతం పైగా పోలింగ్ నమోదయ్యింది. నంద్యాల్లో రెండు ల‌క్ష‌ల పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా ఓట్లర్లు భారీగా బారులు తీరి కనిపిస్తున్నారు. పోలింగ్ ప్రారంభ ద‌శ‌లో పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు ఓటర్ల సహనాన్ని పరీక్షిస్తోంది. పోలింగ్ మొదలైన తర్వాత కొన్ని కేంద్రాల్లో ఒకటి రెండుసార్లు ఈవీఎంలు పనిచేయక ఇబ్బందిపెట్టాయి.

ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు.

టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఓటువేశారు.

వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఉదయమే తన కుటుంబీకులతో కలిసి సంజీవనగర్ పోలింగ్ బూత్‌లో ఓటేశారు.

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వీల్‌చైర్‌‌లోనే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నంద్యాల గాంధీచౌక్‌లోని 61వ బూత్‌లో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కొన్ని చోట్ల చిన్న చిన్న గొడ‌వ‌లు త‌ప్ప నంద్యాల్లో పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతుంది. పోలింగ్ లో మూడు డ్రోన్‌ల‌ను నిఘా కోసం వాడుతున్నారు. మరోవైపు నంద్యాలలో కంట్రోల్ రూం నుంచి ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్, కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి