నంద్యాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే దాదాపు 11 సార్లు విజయం సాధించారంటే ఆ వర్గానికి నంద్యాలలో వున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నంద్యాల అర్బన్, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,56,573 మంది. రెడ్లు, ముస్లిం మైనారిటీలే నంద్యాలలో అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. ఈ రెండు వర్గాలకు చెందినవారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు.  మల్లు, బొజ్జా, శిల్పా, భూమా కుటుంబాలు నంద్యాలలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వైశ్య, వాల్మీకి, పెరిక, బలిజ, దళితుల ఓట్లు కూడా ఇక్కడ బాగానే వున్నాయి. నంద్యాలపై పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. తన  ఒకప్పటి కంచుకోట నంద్యాలలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 
 

Nandyal Assembly elections result 2024 Live ksp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నంద్యాలది ప్రత్యేక స్థానం. ఎంతోమంది ఉద్ధండులను ఈ గడ్డ దేశానికి అందించింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ రెండు కులాలదే ఆధిపత్యం. రెడ్లు, ముస్లిం మైనారిటీలే నంద్యాలలో అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. ఈ రెండు వర్గాలకు చెందినవారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా నంద్యాలలో హ్యాట్రిక్ కొట్టలేదు.

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు, టీడీపీ ఐదు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు ఐదు సార్లు విజయం సాధించారు. మల్లు, బొజ్జా, శిల్పా, భూమా కుటుంబాలు నంద్యాలలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వైశ్య, వాల్మీకి, పెరిక, బలిజ, దళితుల ఓట్లు కూడా ఇక్కడ బాగానే వున్నాయి. అయితే రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే దాదాపు 11 సార్లు విజయం సాధించారంటే ఆ వర్గానికి నంద్యాలలో వున్న పట్టును అర్ధం చేసుకోవచ్చు. వరి, అరటి పంటలకు నంద్యాల కేంద్రం. 

నంద్యాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. భూమా , శిల్పా కుటుంబాలదే ఆధిపత్యం :

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నంద్యాల అర్బన్, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,56,573 మంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి 1,08,868 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి 74,308 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 34,560 ఓట్ల మెజారిటీతో నంద్యాలలో గెలుపొందింది. రవిచంద్ర కిషోర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి తీరాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. సొంత పార్టీలోనూ ఆయనకు పెద్దగా వ్యతిరేకత లేదు. శిల్పా కుటుంబానికి నంద్యాలలోనే కాకుండా కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంచి పలుకుబడి వుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి శిల్పా కుటుంబం విధేయంగా వుంటూ వస్తోంది. 

నంద్యాల శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. జెండా ఎగురవేయాలని టీడీపీ :

నంద్యాలపై పట్టును కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికే టికెట్ కేటాయించిన ఆయన అన్ని రకాలుగా అండగా నిలిచారు. టీడీపీ విషయానికి వస్తే.. తొలుత దివంగత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికా రెడ్డి నంద్యాలలో పోటీ చేస్తారని ప్రచారం జరిగినా సీనియర్ నేత ఎన్ఎండీ ఫరూక్‌కి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. తన  ఒకప్పటి కంచుకోట నంద్యాలలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios