ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపి ఓవైపు... ప్రతిపక్ష పార్టీలన్ని మరోవైపు నిలిచాయి. 2014 లో మాదిరిగానే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి ఓ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇలా హోరాహోరీ పోరులో గెలుపు ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. 

నందిగామ రాజకీయాలు : 

నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టిడిపి ఆవిర్భావం తర్వాత కేవలం రెండుసార్లు (1998, 2019) మాత్రమే నందిగామలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. 1983 లో వసంత నాగేశ్వరావుతో ప్రారంభమైన టిడిపి విజయపరంపర 2014 లో తంగిరాల సౌమ్య వరకు సాగింది. దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమ, తంగిరాల ప్రభాకరరావు నందిగామ ఎమ్మెల్యేలుగా పనిచేసారు. అయితే టిడిపి కంచుకోటను గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి బద్దలుగొట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు విజయం సాధించారు. 

నందిగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. కంచికచర్ల 
2. చందర్లపాడు
3. వీరుళ్లపాడు
4. నందిగామ

నందిగామ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 1,95,053

పురుషులు - 95,681
మహిళలు ‌- 99364

నందిగామ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యేగా మొండితోక జగన్మోహన్ రావు కొనసాగుతున్నా 2024 ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని వైసిపి ఖరారు చేయలేదు. ఇప్పటికే వైసిపి అభ్యర్థులకు సంబంధించిన తొమ్మిది జాబితాలు వెలువడ్డాయి... వాటిలో నందిగామ ప్రస్తావన లేదు. దీంతో నందిగామ సిట్టింగ్ ను మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మాత్రం నందిగామ వైసిపి టికెట్ తనదేనని అంటున్నాడు. 

టిడిపి అభ్యర్థి :

టిడిపి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు మరో అవకాశం ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మరోసారి ఆమెను నందిగామ బరిలో దింపింది టిడిపి అదిష్టానం. 

నందిగామ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

నందిగామ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓటర్లు ‌- 1,54,034

పోలయిన మొత్తం ఓట్లు 1,70,474 (87 శాతం)

వైసిపి - మొండితోక జగన్మోహన్ రావు - 87,493 (51 శాతం) - 10,881 ఓట్లతేడాతో విజయం 

టిడిపి - తంగిరాల సౌమ్య - 76,612 (44 శాతం) - ఓటమి 

నందిగామ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,55,136 (84 శాతం)

టిడిపి - తంగిరాల ప్రభాకరరావు - 77,537 (49.98 శాతం) - 5,074 ఓట్ల తేడాతో విజయం

వైసిపి - మొండితోక జగన్మోహన్ రావు - 72,463 (46 శాతం) - ఓటమి


2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తంగిరాల ప్రభాకరరావు ప్రమాణస్వీకారం చేయకముందే గుండెపోటుతో మృతిచెందారు. దీంతో ఉపఎన్నిక జరగ్గా ప్రభాకరరావు కూతురు తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల భారీ మెజారిటితో విజయం సాధించారు.