Asianet News TeluguAsianet News Telugu

మా అమ్మ ఆశయంతోనే ఈ హాస్పిటల్స్ ఏర్పాటు: బాలకృష్ణ

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఎవరూ చనిపోకూడదనే తమ తల్లి స్వర్గీయ బసవతారకం కోరుకునేవారని ప్రముఖ సినీ నటులు, బసవతారకం ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ తెలిపారు. ఆ ఆశయంతోనే గతంలో హైదరాబాద్ లో ఆమె పేరుతోనే ఆస్పత్రి ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో కూడా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాప చేయడం ఆనందంగా వుందన్నారు. అతి త్వరలో ఈ ఆస్పత్రి ఏపి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని బాలకృష్ణ హామీ ఇచ్చారు.    

Nandamuri Balakrishna at Basavatarakam Cancer Hospital Foundation Stone Laying Ceremony at Amaravathi
Author
Amaravathi, First Published Feb 14, 2019, 1:57 PM IST

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఎవరూ చనిపోకూడదనే తమ తల్లి స్వర్గీయ బసవతారకం కోరుకునేవారని ప్రముఖ సినీ నటులు, బసవతారకం ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ తెలిపారు. ఆ ఆశయంతోనే గతంలో హైదరాబాద్ లో ఆమె పేరుతోనే ఆస్పత్రి ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో కూడా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాప చేయడం ఆనందంగా వుందన్నారు. అతి త్వరలో ఈ ఆస్పత్రి ఏపి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని బాలకృష్ణ హామీ ఇచ్చారు.  

అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు గ్రామంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇవాళ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  బాలకృష్ణ మాట్లాడుతూ...దేశంలోని ప్రతిష్టాత్మక క్యాన్సర్ సంస్థల్లో బసవతారకం హాస్పిటల్ ఏడో స్థానంలో నిలిచిందని తెలిపారు. దీన్ని బట్టే తాము ఎంత శ్రద్ద,నిబద్దతతో నిరుపేదలకు వైద్య సాయం అందిస్తున్నామో అర్థమవుతుందన్నారు.  

ఇక ఇక్కడ 3 దశల్లో వెయ్యి పడకలతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వెల్లడించారు. మొదటిదశలో రూ.300 కోట్లతో 300 పడకల హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అతి త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వేగంగా నిర్మాణ పనులు చేపడతామని బాలకృష్ణ వెల్లడించారు.  
 
ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో అమరావతి మెడికల్ హబ్ గా మారుస్తానన్నారు. క్యాన్సర్ రోగులను ఆదుకునేందుకే బసవతారకం ఆస్పత్రిని ఇక్కడ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నిరుపేదలకు తక్కువ ధరలకే వైద్యం  అందుబాటులో వుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.   

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో బాలకృష్ణ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.  అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు,  వైద్యులు దత్తాత్రేయుడు నోరి, మంత్రులు నారా లోకేశ్‌, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, ఫరూక్‌, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios