ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని తెలిపింది. 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌లో ఎన్నికల కోడ్ ఉల్లఘించారనే అభియోగాలపై సీఎం జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి నాంపల్లిలోని ఎమ్మెల్యే, ఎంపీ కేసుల ప్రత్యేక సెషన్స్ కోర్టు బుధవారం వైఎస్ జగన్‌తో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ముగ్గురు సోమవారం (మార్చి 28) విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి.. కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించారని అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు వైఎస్ జగన్‌తో పాటు అప్పటి వైసీపీ నాయకులైన జి నాగిరెడ్డి, జి శ్రీకాంత్‌లపై అభియోగాలు నమోదు చేశారు. తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత ఈ కేసు సూర్యాపేట జిల్లా పోలీసులు పరిధిలోకి వెళ్లింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లిలోని ఎమ్మెల్యే, ఎంపీల ప్రత్యేక కోర్టు బుధవారం.. వైఎస్ జగన్‌తోపాటు నాగిరెడ్డి, శ్రీకాంత్‌లకు సమన్లు జారీచేసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి.
