Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష: ఎల్లుండి నిర్ణయం తీసుకోనున్న నాంపల్లి సీబీఐ కోర్టు

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  రాసినట్టుగా  చెబుతున్న లేఖపై   నిన్ హైడ్రిన్  పరీక్ష చేయాలని  సీబీఐ చేసిన వినతిపై ఎల్లుండి   నాంపల్లి  కోర్టు  నిర్ణయం తీసుకోనుంది.

Nampally CBI Court   To Verdict decision on  ninhydrin test  of  YS Vivekananda Reddy  letter  lns
Author
First Published Jun 5, 2023, 5:51 PM IST

హైదరాబాద్:వైఎస్ వివేకా లేఖపై  నిన్ హైడ్రిన్  పరీక్ష  జరపాలన్న  సీబీఐ  వినతిపై  నిర్ణయం  ఎల్లుండికి వాయిదా వేసింది  నాంపల్లి  సీబీఐ కోర్టు. 2019  మార్చి  14వ తేదీన  పులివెందులలో  వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.

హత్యకు గురయ్యే ముందు  వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్టుగా చెబుతున్న లేఖ   బయటకు వచ్చింది.  డ్రైవర్ ప్రసాద్ ను త్వరగా  విధులకు  రావాలని చెప్పినందుకు  తనను  చాబబాదాడని  ఆ లేఖలో ఉంది.  డ్రైవర్ ప్రసాద్ ను వదలొద్దని  ఆ లేఖలో   పేర్కొన్నట్టుగా  ప్రచారం సాగుతుంది.  వివేకానందరెడ్డి   రాసినట్టుగా  ఉన్న  లేఖపై  వేలిముద్రల  గుర్తింపునకు నిన్ హైడ్రిన్  పరీక్ష జరపాలని  ఈ ఏడాది  మే  12న  లేఖ  రాసింది.  వైఎస్ వివేకానందరెడ్డి రాసినట్టుగా  చెబుతున్న లేఖపై 2021  ఫిబ్రవరి 21న  ఢిల్లీలోని సీఎఫ్ఎస్‌ఎల్ కు  పంపింది.

 ఒత్తిడిలో  వైఎస్ వివేకానందరెడ్డి   ఈ లేఖ  రాసినట్టుగా   సీఎఫ్ఎస్‌ఎల్ తేల్చింది. అయితే  వైఎస్ వివేకానందరెడ్డి  రాసిన లేఖపై వేలిముద్రల గుర్తింపునకు  నిన్ హైడ్రిన్  పరీక్షకు  అనుమతి  కోరుతూ  నాంపల్లి   కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై  ఎల్లుండి  నాంపల్లి  సీబీఐ  కోర్టు  నిర్ణయం తీసుకోనుంది. 

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య  కేసు విచారణను  ఈ నెల  30వ తేదీ లోపుగా  విచారణను  పూర్తి చేయాలని  సీబీఐని  సుప్రీంకోర్టు  ఆదేశించింది. ఈ నెలాఖరువరకు  సీబీఐ దర్యాప్తు  పూర్తి చేస్తుందా లేదా  అనేది  ఇంకా స్పష్టత  రావాల్సి ఉంది. ఈ కేసులో  శాస్త్రీయ  ఆధారాల  సేకరణకు   సీబీఐ ప్రయత్నాలు  చేస్తుంది. గతంలో ఈ కేసును సిట్  విచారించింది.  చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్న సమయంలో  సిట్ ఏర్పాటైంది.  2019  లో  వైఎస్ జగన్  అధికారంలోకి  వచ్చిన  తర్వాత  వైఎస్ జగన్ సర్కార్  సిట్  ఏర్పాటైంది. ఈ కేసును  సీబీఐతో విచారణ జరిపించాలని  కోరుతూ  ఏపీ  హైకోర్టులో  పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారించిన  ఏపీ హైకోర్టు  సీబీఐ   విచారణకు  ఆదేశించింది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios