ఆనం బ్రదర్స్ లో ఒకరైన మాజీ ఎంఎల్ఏ, టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. వైసిపి ఎంఎల్ఏ రోజాపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్టు సీరియస్ గా స్పందించింది. గతంలో రోజాపై వివేకా మాట్లాడుతూ చాలా అసహ్యంగా మాట్లాడారు. ఆనం చేసిన వ్యాఖ్యలకు రోజా స్పందిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా తర్వాత కూడా వివేకా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. దాంతో రోజా తన పరువుకు భంగం కలిగిందని అంటూ పరువునష్టం దావా వేశారు. అయితే విచారణ సందర్భంగా వివేకా ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. దాంతో నాంపల్లి కోర్టు వివేకాకు అరెస్టు వారెంటును జారీ చేసింది. అసలే  చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వివేకానందరెడ్డి తాజాగా కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంటు ఇబ్బందులు కలిగించేదే.