డెల్టా ప్రాంతాల్లో పర్యటించే హక్కు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి లేదని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. డెల్టా ప్రాంత ప్రజలకు తమ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా 13లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు. పట్టిసీమను వ్యతిరేకించి.. దానిని కట్టడాన్ని జగన్ అడ్డుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఈ ప్రాజెక్టు వల్లే ఇప్పుడు డెల్టా సస్యశ్యామలంగా ఉందని వివరించారు. ఏరోజూ అసెంబ్లీలో అడుగుపెట్టని జగన్ కి అసలు ఓట్లు అడిగే అర్హత లేదని ఆయన అన్నారు. జగన్ ఏనాడు ప్రజా సమస్యలను పట్టించుకోలేనది మండిపడ్డారు. ఈ పది రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండలని సూచించారు. వాస్తవాలు గ్రహించి సరైన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.