అదేదో సినిమాలో డైలాగ్ లాగ ప్రజలంతా ఒకవైపే చూడాలి.     అపుడు వార్తలు చూడాలనుకున్న ప్రజలందరూ చిడతలు పట్టుకని టివి పెట్టుకుంటే చాలు.

కొద్ది రోజుల తర్వాత రాష్ట్ర ప్రజలకు సోషల్ మీడియానే దిక్కేమో. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే ప్రజలకు పూర్తిగా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వ వ్యతిరేక మీడియా రెక్కలు కత్తిరించే పథకానికి చంద్రబాబునాయుడు పదును పెడుతున్నారు. ఫైబర్ గ్రిడ్ సేవల పేరుతో రూ. 149కే ఇంటర్నెట్ సేవలు, టెలిఫోన్, కేబుల్ ప్రసారాలంటూ కొంత కాలంగా సిఎం ఊదరగొడుతున్న సంగతి అందరూ చూస్తున్నదే. తక్కువ ధరలకే గ్రిడ్ సేవలను ప్రజలకు అందించటమే లక్ష్యంగా చెప్పుకుంటున్నారు. అది గనుక అమల్లోకి వస్తే సహజంగానే ధర తక్కువగా వుంటుంది కాబట్టి ప్రజల్లో ఎక్కువమంది గ్రిడ్ సేవలవైపే వెళ్ళే అవకాశం ఉంది.

ఒకసారంటూ ప్రజలు గ్రిడ్ సేవలను అందుకుంటే, ఇక అప్పటి వరకూ కేబుల్ ద్వారా అందుకున్న స్వతంత్ర ప్రసారాల స్ధానంలో ప్రభుత్వం చేస్తున్న ప్రసారాలే దిక్కు. అంటే అదేదో సినిమాలో డైలాగ్ లాగ ప్రజలంతా ఒకవైపే చూడాలి. అపుడు వార్తలు చూడాలనుకున్న ప్రజలందరూ చిడతలు పట్టుకని టివి పెట్టుకుంటే చాలు. ఎంచక్క చంద్రబాబు భజన చూడొచ్చు, మొదలుపెట్టొచ్చు. అయితే, అందరూ భజన చేయటానికి ఇష్టపడరు కదా? మరి వారంతా ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే ఎలా? అటువంటి వారికి సోషల్ మీడియానే దిక్కు. మీడియాను మ్యానేజ్ చేయగలరు కానీ సోషల్ మీడియాను మ్యానేజ్ చేయలేరు.

ఇప్పటికే చంద్రబాబుకు వ్యతరేకంగా సాక్షిలో తప్ప ఇంకే మీడియాలోనూ వార్తలు పెద్దగా రావటం లేదు. దానికే చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. మహిళా పార్లమెంటేరియన సదస్సుపై జాతీయ మీడియాలో నెగిటివ్ వార్తలు వచ్చాయంటూ చంద్రబాబు మండిపడ్డారు. జాతీయ మీడియా అమ్ముడుపోయిందంటూ ఆరోపించటం సంచలనమే. ఇటువంటి సమస్యలేవీ లేకుండా స్ధానిక కేబుల్ వ్యవస్ధను గనుక గుప్పిట్లో పెట్టుకుంటే ప్రభుత్వం ఏం చూపిస్తే జనాలు అవే చూడాలి. పైగా గ్రిడ్ సేవలన్నీ టిడిపి నేతల ద్వారానే అమలవుతాయి కాబట్టి వారికి ఆదాయం కూడా. టివిలో ప్రసారాలు చూసేవారు ఇప్పటికీ సుమారు 85 శాతం స్ధానిక కేబుల్ ఆపరేటర్లపైనే ఆధారపడ్డారు. కాబట్టి త్వరలో దాదాపు ప్రతీ ఇంటిలోనూ చంద్రబాబుకు భజనలే భజనలు.