అసలు ఒళ్ళు తెలీకుండా మాట్లాడటం ఎందుకు? మీడియా హైలైట్ చేస్తే ఉలిక్కిపడటం ఎందుకు?

ప్రజాస్వామ్య వాది నారా చంద్రబాబునాయుడు మీడియాలో వచ్చే సెన్సేషనల్ వార్తలను నియంత్రించాలని నేతలను ఆదేశించారు. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, మీడియాలో వచ్చే సెన్సేషనల్ వార్తలను నియంత్రించకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేయటం గమనార్హం. ఎందుకంటే, అసలు మీడియా మద్దతుతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నది జగద్విధితం. చంద్రబాబు పాలనపై ఒక్క సాక్షిలో తప్ప ఇంకే మీడియాలోనూ వ్యతరేక వార్తలు, కథనాలు రావు. మీడియాను చంద్రబాబు అంతలా మేనేజ్ చేస్తుంటారు. అటువంటిది కొత్తగా మీడియాను నియంత్రించాలని చంద్రబాబు చెప్పటంతో నేతలు ఆశ్చర్యపోయారు.

ఇదంతా ఎందుకంటే, మహిళా పార్లమెంటేరియన్ సదస్సు సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళనపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. దాంతో రాష్ట్రంలోని సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా దుమ్ము రేగిపోయింది. దాంతో చంద్రబాబులో కలవరం మొదలైంది. అందుకనే ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జాతీయ మీడియా అమ్ముడుపోయిందని ధ్వజమెత్తారు. అసలు ఒళ్ళు తెలీకుండా మాట్లాడటం ఎందుకు? మీడియా హైలైట్ చేస్తే ఉలిక్కిపడటం ఎందుకు?

అయినా ఈ మధ్య చంద్రబాబుకు మీడియాపై బాగా అక్కసు వెళ్ళగక్కుతున్నారు. ఏదైనా ప్రశ్న వేయగానే విలేకరిపై మండిపడటం మామూలైపోయింది. ఆడించినట్లు ఆడటానికి సోషల్ మీడియా అయినా జాతీయ మీడియా అయినా చంద్రబాబు జేబులో లేవు కదా.