Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు ఏ పాపం తెలీదు

ఓటుకునోటు కేసు మొత్తం మీద చంద్రబాబు పూర్తి అమాయకుడని తేలిపోయింది. కాబట్టి చంద్రబాబు, టిడిపి ఆల్ హాపీస్

Naidu total innocent in Vote for Cash case

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుకు నిజంగా ఏపాపం తెలీదు. అవినీతి నిరోధక శాఖ, రాష్ట్రంలోని ప్రతిపక్షం వైసీపీలు కావాలనే చంద్రబాబుపై బురద జల్లుతున్నట్లు కనబడుతోంది. ఒకవేళ టిడిపి నేతలు ఎవరికైనా డబ్బు ఇవ్వజూపినా అందులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదన్నదే వాస్తవం.

 

దాదాపు ఏడాదిన్నర క్రితం దేశంలోనే సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ కేసు అదరికీ గుర్తుండే ఉంటుంది. తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటు వేయటానికని నామినేటెడ్ ఎంఎల్ ఏ స్టీఫెన్ సన్ ఓటు కోసం టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. జరిగినది ఏమిటి? జరిగిన వ్యవహారంలో సూత్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరన్నది అందరికీ తెలిసిందే.

 

టిడిపి అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు ఇటు టిడిపికి అటు స్టీఫెన్ కు మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం విలువ రూ. 5 కోట్లు. అందులో అడ్వాన్స్  ఇచ్చేందుకని  స్టీఫెన్ ఇంటికి రేవంత్ రూ. 50 లక్షలు తీసుకుని వచ్చారు.

 

డబ్బులు ఇచ్చే సమయంలోనే తెలంగాణా ఏసిబి అధికారులు స్టీఫెన్ ఇంటిపై దాడి చేసారు. రూ. 50 లక్షలు ఇస్తున్న రేవంత్ తదితరులను సాక్ష్యాధారాలతో సహా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. వీడియోల్లో కూడా అదే కనబడింది.

 

 

వెలుగు చూసిన వీడియోల ఆధారంగా ఏసిబి పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, తెర వెనుక జరిగిన పరిణామాల నేపధ్యంలో కేసు విచారణ నత్త నడకను తలపిస్తోంది. దాంతో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి విచారణ తీరుపైన, చంద్రబాబు పాత్రపైన ఏసిబి న్యాయస్ధానంలొ కేసు దాఖలు చేసారు.

 

అయితే, తనపై విచారణ జరపటాన్ని సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో సవాలు చేసారు. సదరు కేసుపైనే హై కోర్టు జడ్జి తాళ్ళూరి సునీల్ కుమార్ తీర్పు చెప్పారు. సదరు తీర్పులో జడ్జి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, ‘చంద్రబాబుపై స్టీఫెన్ ఎటువంటి ఫిర్యాదు చేయలేద’న్నారు.

 

‘కేవలం ఫోన్ సంభాషణల ఆధారంగా ఆళ్ళ చేస్తున్న ఆరోపణలను రుజువుచేయం కష్టమ’న్నారు. పైగా ‘క్రిమినల్ కేసుతో ఎటువంటి సంబంధంలేని మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటానికి వీలేద’న్నారు.

 

అదేవిధంగా, ‘చంద్రబాబు ప్రేరణతోనే మిగిలిన నిందుతులు తనను కలసినట్లుగా స్టీఫెన్ సన్ ఎక్కడా చెప్పలేద’ని వ్యాఖ్యానించారు. పైగా టిడిసిరి అనుకూలంగా ఓటు వేయమని కానీ లేక ఓటింగ్ కు గైర్హాజరుకావాలని కానీ కోరలేదని అభిప్రాయపడ్డారు.

 

అంటే స్టీఫెన్ సన్ ను కలవటం రేవంత్ తన ఇష్టం ప్రకారమే చేసారని అనుకోవాలి. డబ్బు ఇవ్వటం కూడా తన ఇష్టమే. అంటే ఓటుకునోటు కేసు మొత్తం మీద చంద్రబాబు పూర్తి అమాయకుడని తేలిపోయింది. కాబట్టి చంద్రబాబు, టిడిపి ఆల్ హాపీస్

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios