అతిధులకు మర్యాదలు చేయటంలోనూ, విందులు ఇవ్వటంలోను చంద్రబాబునాయుడు తర్వాతనే ఇంకెవరైనా.
అతిధులకు మర్యాదలు చేయటంలోనూ, విందులు ఇవ్వటంలోను చంద్రబాబునాయుడు తర్వాతనే ఇంకెవరైనా. అందుకే ఆతిధ్యమంటే అందరూ చంద్రబాబు పేరే చెప్పుకుంటారు. అందుకు తాజా విందే నిదర్శనంగా నిలిచింది. అంతర్జాతీయసదస్సులో పాల్గొనేందుకు విజయవాడకు పలువురు న్యామమూర్తులు వచ్చారు. వారి గౌరవార్ధం సిఎం విందు ఇచ్చారు. వారి విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే, విందు ఇచ్చిన పున్నమి ఘాట్ కు అందరికన్నా ముందుగా వచ్చి చేసిన ఏర్పాట్లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారట.
విందులో వడ్డించిన ఆహారపదార్ధాల తయారీని అడిగి మరీ తెలుసుకున్నారట. న్యాయమూర్తుల్లో ఎవరెవరికి ఏది ఇష్టమో దగ్గరుండి మరీ చూసుకున్నారని సమాచారం. మొత్తానికి న్యాయమూర్తులకు ఇచ్చిన విందులో చంద్రబాబు బాగానే హడావుడి చేసారంటూ చెప్పుకుంటున్నారు. విందుకు వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించటం, కుర్చీల్లో కూర్చోబెట్టటం, వెలకం డ్రింక్ అందుతున్నదీ లేనిదీ చూసుకోవటం లాంటివి కూడా చంద్రబాబే చూసుకున్నారని అంటున్నారు. విందు దగ్గర న్యాయమూర్తులు దాదాపు 2 గంటలు గడిపారు. సరే విందు తర్వాత ఎలాగూ ఘన సన్మానం ఉంటుంది కదా.
ఇంతమంది న్యాయమూర్తులు ఒకేచోట ఉన్నపుడు భద్రతా చర్యలు కూడా గట్టిగానే చేసారట. శుక్రవారం మధ్యాహ్నం నుండే సందర్శకులను ఎవరరినీ అనుమతించలేదట. శివరాత్రి సందర్భంగా ఘాట్ లో స్నానం చేద్దామని వచ్చిన భక్తులను కూడా వెనక్కుపంపేసారట. చివరకు పున్నమీ ఘాట్ ఉద్యోగులను సైతం విందు జరిగిన పరిసరాల్లోకి రానీయలేదట. కొద్దిమంది సిబ్బందిని మత్రమే ఎంపిక చేసి వారికి కూడా పాస్ ఇచ్చారంటేనే ఎంతటి జాగ్రత్తలు తీసుకున్నారో అర్ధమవుతోంది.
