తమ అభ్యర్ధికి 20 వేల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ‘తానెప్పుడూ జోస్యాలు చెప్పను గానీ...ఏదో మీడియా అడుగుతోంది కాబట్టి చెబుతున్నా’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోల్లో జనాలు లేనిమాట వాస్తవం. ఎక్కడ ప్రచారం నిర్వహించినా జనాలకు కిరాయి ఇచ్చి మరీ పిలిపించేందుకు టిడిపి నేతలు అవస్తలు పడ్డది నిజం.

‘నంద్యాల ఉపఎన్నికలో టిడిపికి 20 వేల మెజారిటీ వస్తుంది’ ...ఇది చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. మంగళవారం రాత్రి మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, తమ అభ్యర్ధికి 20 వేల మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ‘తానెప్పుడూ జోస్యాలు చెప్పను గానీ...ఏదో మీడియా అడుగుతోంది కాబట్టి చెబుతున్నా’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోల్లో జనాలు లేనిమాట వాస్తవం. ఎక్కడ ప్రచారం నిర్వహించినా జనాలకు కిరాయి ఇచ్చి మరీ పిలిపించేందుకు టిడిపి నేతలు అవస్తలు పడ్డది నిజం.

చివరకు మంత్రి, అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి సోదరైన భూమా అఖిలప్రియను కూడా జనాలు ఎక్కడికక్కడ నిలేసారు. పార్టీ ఫిరాయించినందుకు అఖిలను జనాలు నిలదీసారు. ఎన్నోసార్లు ప్రచారాన్ని అర్ధాంతరంగానే ముగించుకుని అఖిల వెళ్ళిపోయారు. ఏదో ఊడపీకుతాడనుకున్న బాలకృష్ణ ప్రచారం కూడా అంతంతమాత్రంగానే ముగిసింది. ఇక, మంత్రుల సంగతి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటం దగ్గర నుండి వైసీపీ నేతలపై దాడులు చేయటం, ఇళ్ళపై పోలీసులను ఉసిగొల్పటం...ఇలా చెప్పుకుంటూ పోతే టిడిపి తొక్కిన అడ్డదారులు అన్నీ ఇన్నీ కావు.

అధికారంలో ఉన్న పార్టీ ఇన్ని అడ్డదారులు తొక్కిందంటే దేనికి సంకేతం. చివరకు ప్రచార గడువు ముగిసిన తర్వాత వెళ్లిపోవాల్సిన మంత్రులు, నేతలు నంద్యాల చుట్టుపక్కలే తిష్టవేసి డబ్బులు, మద్యం పంపిణీలో యాక్టివ్ పార్ట్ తీసుకున్నారన్న ఆరోపణలు వినబడ్డాయి. అన్నీ నిబంధనలు తుంగలోతొక్కి, వ్యవస్ధలను లొంగదీసుకున్న విషయం అందరూ చూసిందే. ఇంత జరిగిన తర్వాత కూడా టిడిపికి 20 వేల మెజారిటీ వస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారంటే మెచ్చుకోవాల్సిందే.