పాపం..టిడిపికి సొంత పేపర్, ఛానలే లేదట....

Naidu says tdp has no paper and channel like ycp
Highlights

  • ‘సొంత పేపర్, ఛానెల్ లేకుండానే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించాం. పేపర్, ఛానెల్ ఉన్న విపక్షం ఘోరంగా విఫలమైంది’
  • పార్టీకి సొంతంగా పేపర్, ఛానెల్ లేవట. నిజమే, చంద్రబాబుకు గానీ టిడిపికి గానీ ప్రత్యక్ష్యంగా మీడియాలేని మాట వాస్తవమే.
  • కానీ చంద్రబాబు కోసమే తపిస్తూ, అహర్నిసలు పనిచేస్తున్న మీడియా సంస్ధలు చాలానే ఉన్నాయి. ఆ విషయం రాజకీయాలతో సంబంధాలున్న ఎవరినడిగినా చెప్పేస్తారు.

‘సొంత పేపర్, ఛానెల్ లేకుండానే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించాం. పేపర్, ఛానెల్ ఉన్న విపక్షం ఘోరంగా విఫలమైంది’...ఇది చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు. మంగళవారం టిడిపి ప్రజా ప్రతినిధుల వర్క్ షాపు ప్రారంభమైంది లేండి. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ, ‘గతంలో పార్టీకి దూరమైన వర్గాలు ఈ ఎన్నికల్లో టీడీపీకి దగ్గరవడమే అసలు విజయం’...‘ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే కొత్త ఓటు బ్యాంకును సాధించుకోవడంతో గెలుపు సాధ్యమైంది’ అన్నారు చంద్రబాబు.  నంద్యాల, కాకినాడలో గెలుపుతో చంద్రబాబులో కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగానే పెరిగినట్లు కనబడుతోంది.

 

పార్టీకి సొంతంగా పేపర్, ఛానెల్ లేవట. నిజమే, చంద్రబాబుకు గానీ టిడిపికి గానీ ప్రత్యక్ష్యంగా మీడియాలేని మాట వాస్తవమే. కానీ చంద్రబాబు కోసమే తపిస్తూ, అహర్నిసలు పనిచేస్తున్న మీడియా సంస్ధలు చాలానే ఉన్నాయి. ఆ విషయం రాజకీయాలతో సంబంధాలున్న ఎవరినడిగినా చెప్పేస్తారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, టిడిపి నేతలకన్నా కుడా మీడియాలోని ఓ వర్గం చంద్రబాబు కోసమే పనిచేస్తోందన్నవిషయం అందరికీ తెలిసిందే. అటువంటిది టిడిపికి సొంత పేపర్ లేదు, ఛానల్ లేదని చంద్రబాబు చెప్పుకోవటం ‘నిప్పు’ చంద్రబాబుకే చెల్లింది.

 

పనిలో పనిగా టిడిపిలోకి ఎవ్వరైనా చేరొచ్చని చంద్రబాబు పిలుపిచ్చేసారు.  ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబునాయుడే బహిరంగంగా ప్రకటించారు. ‘టిడిపిలోకి ఎవ్వరూ రాకకూడదు, మేమే ఉండాలి’ అనే ధోరణి మానుకోవాలన్నారు. అంటే అర్ధమేంటి? వచ్చే ఎన్నికల్లోగా ఇతర పార్టీలకు చెందిన వారు ఎంతమంది వచ్చినా చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లే కదా.

 

అంటే ఇప్పటి వరకూ ఇతర పార్టీలు ప్రధానంగా వైసీపీ నుండి ఎవరైనా వస్తారంటే పార్టీలోని సీనియర్లు కొన్నిచోట్ల సీనియర్లలో అభద్రత మొదలవుతోంది. దాంతో సీనియర్లు కొత్త వారు పార్టీలోకి రావటాన్ని ఇష్టపడటం లేదు. అదే విషయమై చంద్రబాబు మాట్లాడుతూ, కొత్త వారిని ఎవరూ అడ్డుకోవద్దంటూ పరోక్షంగా హెచ్చరించారు. పార్టీలోకి చేరటానికి వచ్చే ఎవ్వరి విషయంలోనైనా సరే టిడిపి నేతలు పరిస్ధితులు అర్ధం చేసుకుని సర్దుకుపోవాలని స్పష్టం చేసారు. పార్టీలోకి కొత్తగా ఎవరైనా చేరుతున్నారంటే అర్ధం పార్టీ బలోపేతమవుతోందనట. ‘పార్టీ బలపడితే నేతలు కూడా బలపడుతారు కదా’ అని ప్రశ్నించారు.

loader