పార్టీ సమన్వయ కమిటి సమావేశంలో మాట్లాడుతూ, పార్టీలోని సమర్ధకులకు మంత్రివర్గంలో చోటు కల్పంచలేకపోతున్నట్లు వాపోయారు. ఆ విషయం చంద్రబాబుకూ బాధ కలిగించిందట.

తెలుగుదేశంపార్టీలో ఇటీవలి పరిణామాలు చంద్రబాబునాయుడుపై బాగానే ప్రభావం చూపినట్లున్నాయ్. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతోందని బాధపడటంలోనే సిఎం బాధేమిటో అందరికీ తెలిసిపోతోంది. తమ్ముళ్లు బాధ పడుతున్నందుకు కాదు చంద్రబాబు బాధపడుతున్నది. అంతర్గత సమస్యలపై రోడ్లెక్కుతున్నందుకు, అవి మీడియాకెక్కుతున్నందట.

ఈరోజు జరిగిన పార్టీ సమన్వయ కమిటి సమావేశంలో మాట్లాడుతూ, పార్టీలోని సమర్ధకులకు మంత్రివర్గంలో చోటు కల్పంచలేకపోతున్నట్లు వాపోయారు. ఆ విషయం చంద్రబాబుకూ బాధ కలిగించిందట. విజయవాడలో జరిగిన రవాణాశాఖ కమీషనర్ బాలసుబ్రమణ్యంపై దాడి వ్యవహారం, మంత్రివర్గం విస్తరణపై జరిగిన ఆందోళనలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు. సంస్ధాగత ఎన్నికలకు రెడీగా ఉండాలని కూడా చెప్పారు.

అదే సమయంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, పార్టీ నేతలు పదవులు తీసుకున్న తర్వాత పార్టీని పట్టించుకోవటం లేదట. బాగానే ఉంది కదా? పార్టీకి మొదటి నుండి కష్టపడిన వాళ్ళని తండ్రి, కొడుకులు గాలికి వదిలేసినట్లే పదవులు పొందిన నేతలు వాళ్ళదారిలోనే నడుస్తున్నారు. తప్పేమీ లేదు కదా? అటువంటి వాళ్ళను గమనిస్తున్నట్లు లోకేష్ చెప్పటం గమనార్హం.