విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఏంటి నిజమేనా? దశాబ్దాల పాటు చార్జీలు పెరగటాన్ని మాత్రమే చూస్తున్న వినియోగదారులకు చార్జీలు తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటన చేస్తే నిజంగానే షాక్ కొట్టకేమవుతుంది? తాజాగా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన గురించి రాష్ట్రంలో పెద్ద చర్చే మొదలైంది. అమరావతిలో పచ్చదనం కార్యక్రమాన్ని శనివారం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంచే ప్రసక్తే లేదని, పైగా తగ్గించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం గతంలో కూడా చెప్పారనుకోండి అది వేరే సంగతి.

 రాష్ట్రంలో సోలార్ విద్యుత్ కు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు కూడా రాబోతున్నాయట. అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తే సంప్రదాయ పద్దతిలో ఉత్పత్తవుతున్న విద్యుత్ భారం తగ్గుతుంది కాబట్టి విద్యుత్ చార్జీలు తగ్గించవచ్చని అయ్యుంటుంది. అదంతా ఎప్పటికయ్యేను? బహుశా వచ్చే ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చార్జీలు తగ్గిస్తే తగ్గించచ్చేమో. ఒకవేళ చంద్రబాబే గెలిస్తే మళ్ళీ చార్జీలు పెంచేస్తారనటంలో ఎవరికీ అనుమానాల్లేవ్.  లేకపోతే అధికారంలోకి వచ్చిన వాళ్ళే వాళ్ళ అవస్తలు వాళ్ళు పడతారు.