‘పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా’..ఇది చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు. ఏంటి చంద్రబాబు చెప్పిన విషయాలను నమ్మలేకున్నారా? రుణాలన్నింటినీ మాఫీ చేసేసామని చంద్రబాబు చెప్పేసారు కాబట్టి నమ్మాల్సిందే. రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అమలు ఏదశలో ఉన్నాయో హటాత్తుగా అడిగితే ఎవరూ చెప్పలేరు. రుణమాఫీల అమలులో చంద్రబాబు వేసినన్ని పిల్లిమొగ్గలు ఎవరికీ అర్ధంకావు.

‘పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా’..ఇది చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తిరుపతిలో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తానిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రైతు రుణమాఫీతో పాటు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను కూడా తాను నిలబెట్టుకున్నట్లు చెప్పారు.

ఏంటి చంద్రబాబు చెప్పిన విషయాలను నమ్మలేకున్నారా? రుణాలన్నింటినీ మాఫీ చేసేసామని చంద్రబాబు చెప్పేసారు కాబట్టి నమ్మాల్సిందే. రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అమలు ఏదశలో ఉన్నాయో హటాత్తుగా అడిగితే ఎవరూ చెప్పలేరు. రుణమాఫీల అమలులో చంద్రబాబు వేసినన్ని పిల్లిమొగ్గలు ఎవరికీ అర్ధంకావు. రుణాలమాఫీ అమలులో జనాలను ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు అయోమయంలోకి నెట్టేసారు.

తాజాగా రుణాలమాఫీలన్నింటినీ చేసేసానని చంద్రబాబు చెబితే ఎవరు మాత్రం ఏ మాట్లాడగలరు? ఒకవైపు తమ రుణాలు మాఫీ కాలేదు మొర్రో అంటూ రైతులు, డ్వాక్రా మహిళలు నెత్తీ, నోరు బాదుకుంటున్నది అందరూ చూస్తున్నదే. అయినా రుణాలను మాఫీ చేసేసానని చంద్రబాబు చెబుతుంటే ఎవరికీ నోట మాట రావటం లేదు. ఏం చేస్తాం.

రుణమాఫీలు సరి. మరి, ఇంటికో ఉద్యోగం సంగతి? ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి మాటేంటి? కాపులను బిసిల్లోకి చేరుస్తానన్న హామీ ఏమైంది? 15 ఏళ్ళు ప్రత్యేకహోదా కావలన్న డిమాండ్ మాటేంటి? విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధిస్తామన్న హామీ ఏమైంది? బహుశా ఆ హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చేసారేమో? ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణం కూడా ఎప్పుడో అయిపోయిందేమో. జనాలకే తెలీటం లేదు. ఏంటి, ఇవన్నీ ఎప్పుడయ్యాయని అనుకుంటున్నారా? అదంతే ఎప్పుడో అయిపోయాయ్. చెప్పింది చంద్రబాబా ఇంకెవరన్నానా?