సంక్రాంతి పండుగ సమయంలో చంద్రబాబునాయుడు పెద్ద జోకే పేల్చారు. శుక్రవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడి-చంద్రబాబు సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సమస్యలని, విభజన సమస్యల పరిష్కరించాలంటూ చంద్రబాబు ప్రధానికి 17 పేజీల నోట్ అందచేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రధాని చంద్రబాబుకు అపాయిట్మెంట్ ఇవ్వటం గమనార్హం. కాబట్టి వీరిద్దరి మధ్య భేటీలో ఏమి జరిగిందన్నదీ స్పష్టంగా ఎవరికీ తెలీదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెబితే అది నమ్మాల్సిందే.

సరే, ప్రధానితో చంద్రబాబు మాట్లాడేటప్పుడు అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అందులో ఏవీ కుడా కొత్తవేమీ కావు. మూడున్నరేళ్ళుగా చంద్రబాబు అడుగుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి చూస్తూనే ఉన్నారు. కాబట్టి సమస్యల పరిష్కారానికి ప్రధానమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారిస్తారని పెద్దగా ఆశలేమీలేవు. కాకపోతే తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనే చంద్రబాబు పెద్ద జోక్ పేల్చారు. ఇంతకీ అదేమిటంటే, ‘రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని తన లాగ ఒత్తిడి చేసేవారు ప్రపంచం మొత్తం మీద ఇంకోరు లేర’ట.

చంద్రబాబు చెప్పిందే నిజమనుకుంటే మూడున్నరేళ్ళుగా కేంద్రంపై చంద్రబాబు ఏమాత్రం ఒత్తిడి పెంచారో అందరూ చూస్తున్నదే. ఏడాదిన్నరగా అసలు ప్రధానమంత్రి అపాయిట్మెంటే సాధించలేని చంద్రబాబుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేంత సీన్ ఉందా?  నిజంగానే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెడుతుంటే విభజన సమస్యలు ఎందుకు పరిష్కారం కావటం లేదు? పైగా ‘సమస్యలు పరిష్కరించకపోతే రాజీనామాలు చేస్తామన్నారు ఏమైందం’టూ వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా ఎద్దేవా చేస్తున్నారు. అంటే, అధికారంలో ఉన్న వారేమో పదవులను అంటిపెట్టుకునుండాలి. ప్రతిపక్షం మాత్రం పదవులకు రాజీనామాలు చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. ఎలావుంది చంద్రబాబు లాజిక్