మందుబాబులనే ఎగతాళి చేస్తూ మాట్లాడటం ఆయనకే చెల్లింది.

మందుబాబులకు మందు తాగకుంటే మైండ్ పనిచేయదట. ఎంత ఎగతాళో చూడండి. ఓవైపు మందుబాబులను ప్రోత్సహిస్తూ, ఇంకో వైపు మద్యం ఆదాయంపైనే ఆధారపడుతూ మళ్ళీ మందుబాబులనే ఎగతాళి చేస్తూ మాట్లాడటం ఆయనకే చెల్లింది. ఇంతకీ ఎవరిగురించనే కదా మీ అనుమానం. అదేనండి సిఎం చంద్రబాబునాయడు గురించే ఇదంతా.

నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై సిఎం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, నగదు రహిత లావాదేవీల పురోగతిపై తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఎందుకంటే, మంత్రులు, ఎంఎల్ఏలు, ఉన్నతాధికారుల్లోనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వారి సంఖ్య 20 శాతం కూడా లేదట.

దాంతో సిఎం బిత్తరపోయారు. అయితే, అంతలోనే కాస్త తేరుకున్నారు. ఎందుకంటే, మద్యం వ్యాపారం మాత్రం కాస్త పుంజుకున్నదట. బార్లు, మద్యం షాపుల్లో ఆన్ లైన్ లావాదేవీలు పెరగటం పట్ల చంద్రబాబు సంతోషించారు. అయితే, అదే సమయంలో మద్యం తాగే వాళ్ళను బాగా ఎగతాళి చేస్తూ మాట్లాడారు.

మందుబాబులకు మద్యం తాగనిదే మైండ్ పనిచేయదట. మద్యం కొనుగోలు కోసం మాత్రం మందుబాబులు మైండ్ ను బాగా ఉపయోగిస్తున్నారని చెప్పటం గమనార్హం.