Asianet News TeluguAsianet News Telugu

ముచ్చుమర్రి పచ్చిమోసం

ఇంతా చేసి  కెసి కెనాల్  రైతులకిది ఉపయోగమేనా?ఎందుకవుతుంది..తుంగభద్ర డామ్ నుంచి రావాల్సిన 10 టిఎంసి నికరజలాలు పోగొట్టుకుని కృష్ణ వరద మీద ఆధారపడ వలసి వస్తుంది.

Naidu launches Muchumarri Lift in Kurnool district

అనగనగా కర్నాటకలో ఉన్న పడమటికొండల్లో తుంగ,భద్ర అనే నదులు పుట్టాయి.అవి రెండూ కలిసి తుంగభద్ర నది అయింది.ఒకనాటి రాయలసీమ,రాయలవారి రాజధానికి హంపి సమీపంలో ఉన్న హొస్పేట్ లో దాని మీద ఒక డామ్ నిర్మించారు....


అక్కడి నుంచి రెండు కాలువలు HLC(HIGH LEVEL CANAL)LLC(low level canal)లు కొన్ని కిలోమీటర్లు కర్నాటకలో పారి అనంతపురం,కర్నూల్ జిల్లా కొన్ని ప్రాంతాలకు నీళ్లందించాలి.


సరే ఆనకట్ట కట్టినా నీళ్లు దిగువకు పారాల్సిందే కదా....అప్పుడెప్పుడో డచ్ వాళ్లు మొదలు పెట్టి చేతకాక చేతులెత్తేస్తే కాటన్ దొర తుంగభద్ర మీద సుంకేసుల దగ్గర ఒక బారేజ్ కట్టించాడు...ఇక్కడ తుంగభద్ర ఒక వైపు ప్రయాణించి కృష్ణలో కలుస్తుంది...మరొకటి కర్నూల్-కడప కాలువ..దీన్నే K.C.Canal అంటారు.ఈ కాలువ మొత్తం ప్రవహించేది 306 కి.మీలు.దారిలో ఎన్నో వాగులూ,వంకలను కలుపుకుని పారుతుంది.సుమారు 2.5 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది.

 

ఇక ఈ కాలువకు ఉన్న నికరజలాల కేటాయింపు 39.9 tmc.దీనిలో 10 tmc నీటిని హొస్పేట్ లో ఉన్న తుంగభద్ర దామ్ నుంచి వదులుతారు...మిగిలిన 29.9 tmc లు తుంగభద్ర నది కింద సుంకేసులకు ఎగువ కురిన వర్ధాలు ఆధారం....ఒక్కో ఏడు కురవాల్సిన దానికన్నా ఎక్కువ కురిస్తే అన్నీ కృష్ణలో కలుస్తాయి...కురవని సంవత్సరాల్లో మాకు ఇబ్బంది కదా గుండ్రేవుల అనే చోట ఒక రిజర్వాయర్ ను నిర్మించమని ఎన్నో వినతులు ఇచ్చినా బుట్టదాఖలు అయ్యాయి.

2


మా అనంతపురం జిల్లా ఎందరో పుణ్యాత్ములకు పురిటిగడ్డ.అసలా తొలితరం నాయకులు తరిమెల,నీలం గార్ల ఊర్లకు కూతవేటు దూరం లో పెన్నా నది ప్రవహిస్తుంటుంది...కానీ చుక్క నీళ్లుండవు...అక్కడి జనాలకు ఆ నది మీద ఎంత నమ్మకమంటే ఏకంగా నది మధ్యలో ఇటుకల బట్టీలు వెలసాయి.
ఇక పెన్న మీద చినాపెద్దా డాములు కట్టినా ఎగువ నుంచి నీరొస్తే కదా!


అప్పుడు బాబు గారి పాలన...ఇక అనంతపురం జిల్లాలో ఎప్పుడూ మహా నాయకులే!...మేము ఫాక్షనిస్ట్ అని ఈసడించుకున్నా, ఈ అభినవ గాంధి విగ్రహాలు కోస్తాంధ్ర లో కనిపిస్తాయి.
మొత్తానికి ఈ జిల్లా నాయకులు జనానికి నీళ్లు ఇదుగో తెస్తాం,ఆ చెరువు నింపుతాం అనే వాగ్దానాలు చేస్తుంటారు కాబట్టి,మన బాబు ఎలాగూ అల్లుడుగారే కాబట్టి...అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు k.c.canal కు తుంగభద్ర డామ్ నుంచి రావాల్సిన నీళ్లు 5tmc దానం చేసాడు.ఇవి HLC ద్వారా అనంతపురం జిల్లాకు పారుతాయి...


ఆ తర్వాత YSR పాలన...ఎవరి పాలనైనా మస్కా కొట్టే ఈ నాయకులు మళ్లీ వరమడిగారు...ఇంకేం..మరో 5 tmc దానం చేసాడు..అంటే తుంగభద్ర డామ్ నుంచి వచ్చే మా వాటా రాదు...

కానీ....


YSR చేసిన మంచి పనేమంటే ఆ పోగొట్టుకుంటున్న నీటికి పరిహారంగా ఒక వెసలు బాటు కల్పించాడు. తెలుగుగంగ,శ్రీశైలం కుడికాలువలుగా కృష్ణాజలాలు విడిపోయే బనకచర్ల కు అతి సమీపంలో k.c.canal పారుతుంది...కృష్ణా మిగులు నీళ్లను అందులో పారించే అప్రోచ్ కెనాల్ ఏర్పాటు చేసాడు. కానీ ఈ బనకచర్లకు ఎగువన పారే..అంటే K.C.canal పుట్టే సుంకేసుల నుంచి సుమారు 120 కి.మీ వరకు నీళ్లు పారవు కదా...వారికోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల పధకం ప్రారంభించాడు...కృష్ణలో నీళ్లు తోడుతారు. 5tmc నీళ్లు k.c.canal లో పోస్తారు...Reverse technology ద్వారా 120 కి.మీ నుంచి 0 కి.మీ కి పంపే ఏర్పాటది.

 

3

 

తుంగభద్ర లో పూడిక,ఆవిరి నష్టాలు లెక్క వేసి కాలువలు అన్నింటికీ ఒక నిష్పత్తి ప్రకారం నీళ్లు పంపుతారు...చాలా పాత ఆనకట్ట కాబట్టి గతకొన్నేళ్లుగా పూడిక వల్ల పూర్తిగా నిండటం లేదు...ఈ దామాషా పద్దతిలో అక్కడి నుంచి k.c.canal వాటా 10 tmc లకు గానూ ఏ 7,8tmc ల నీళ్లే దక్కుతాయి.... 

 

ఆ లెక్క ప్రకారమే బనకచర్ల,ముచ్చుమర్రి నుంచి తీసుకుపోవాలి..ముచ్చుమర్రి పదకం తయారు కానందున ఆ నీళ్లు 3,4 సంవత్సరాలు బనకచర్ల నుంచి కిందికి తీసుకున్నారు....గత రెండేళ్లుగా వానలు లేక చుక్క నీరు తీసుకోలేకపోయారు k.c.canal రైతులు....ఈ తీసుకున్న సంవత్సరాల్లో 0-120 కి.మీ వాళ్లకు ముచ్చుమర్రి తయారు కానందున బాగా అవస్థల పాలయ్యారు...


ఇక YSR మరణించేనాటికే ముచ్చుమర్రి పనులు చాలా భాగం పూర్తయ్యాయి...ఆ తర్వాత నత్తనడకన సాగాయి,కొన్నాళ్లు నిలచిపోయాయి....
ప్రభుత్వం ఇప్పుడు చెప్పే కారణం ఫాక్షన్ నాయకులు ఆపారని...ఇదో పచ్చి అబద్దం....


కోస్తాంధ్ర రైతులు పోలవరం కుడి కాలువ పనులు కోర్టులకు పోయి ఆపారు,కానీ వాళ్లనేం అనరు...
ఇక్కడ controlled blasting జరపకుండా పల్లెల్లో కొంపలు కూలే బ్లాస్టింగులు జరుపుతుంటే కోర్ట్ కు పోవడం ఫాక్షనిజం అయింది....


4

ఏమైతేనేం ముక్కుతూ,మూల్గుతూ మిగిలిన అరాకొరా పనులు పూర్తి చేసి ఈ రోజు "జాతి"(?)కి అంకితం చేస్తూ....నాయకులంతా...రాయలసీమ సస్యశ్యామలం,ఒక మైలురాయి,పురోగతి...తొక్కాతోటకూర అంటూ కబుర్లు....


తీరా చూస్తే అక్కడి నుంచి ఎత్తిపోసేది 5tmc నీళ్లు....అవీ బ్రిటిషోడు తవ్వించిన కెనాల్ లోనికే...


ఎప్పుడైనా వరదలొస్తే హంద్రీ-నీవా లోకి ఎత్తిపోసుకోవడానికి కొన్ని పంపులు పెట్టారు...k.c.canal లోకి ఎత్తిపోయడానికి పెట్టిన 4 పంపుల్లో రెండింటిని ఈ రోజు ప్రారంభించి రాయలసీమ ను ఉద్దరించామని కోతలు కోసారు.


ఇంతా చేసి k.c.canal రైతులకిది ఉపయోగమేనా?ఎందుకవుతుంది..తుంగభద్ర డామ్ నుంచి రావాల్సిన 10 tmc నికరజలాలు పోగొట్టుకుని కృష్ణ వరద మీద ఆధారపడ వలసి వస్తుంది.
ఇక కృష్ణ మిగులుజలాలమెద పాలమూరు-రంగారెడ్డి,కల్వకుర్తి ఎత్తిపోతలూ మొదలయ్యాయి...


నిన్నామొన్నా వార్తల ప్రకారం కృష్ణ నదిలో 40 ప్రదేశాల్లో టెలిమెట్రిక్ యంత్రాలను అమరుస్తున్నారు...
ముందుముందు రాష్ట్రాల మధ్యే కాదు..రాయలసీమలోని కర్నూలు,అనంతపురం జిల్లాల మధ్యా నీటి చిచ్చు రగలటానికి మరెంతో కాలం పట్టదు...

Follow Us:
Download App:
  • android
  • ios