Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో ముందస్తు ఎన్నికలు

  • ఎంఎల్ఏ బోండాఉమ మీడియాతో మాట్లాడుతూ, 2018 చివరిలోనే ఎన్నికలు వస్తాయని చంద్రబాబు అన్నట్లు తెలిపారు.
  • మొన్నటి నంద్యాల ఉపఎన్నికలో 56 శాతం ఓట్లు రాగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓట్ల శాతం 60కి చేరాలని సిఎం స్పష్టంగా చెప్పారట.
Naidu hints early poll in the state

ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలని చంద్రబాబునాయుడు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో టిడిపి నేతల సమావేశం జరిగింది. సమావేశం సందర్భంగా ఎంఎల్ఏ బోండాఉమ మీడియాతో మాట్లాడుతూ, 2018 చివరిలోనే ఎన్నికలు వస్తాయని చంద్రబాబు అన్నట్లు తెలిపారు. మొన్నటి నంద్యాల ఉపఎన్నికలో 56 శాతం ఓట్లు రాగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓట్ల శాతం 60కి చేరాలని సిఎం స్పష్టంగా చెప్పారట. 80 శాతం ప్రజలు సంతృప్తి పడే స్ధాయికి తమ పాలనను తీసుకెళ్ళాలని చంద్రబాబు నిర్ణయించినట్లు బోండా వెల్లడించారు. అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించటమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీలు నియోజకవర్గ ఇన్చార్జిలతో ‘మిషన్ 2019’ పేరుతో మంగళవారం వర్క్ షాపు కుడా  జరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios