అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తన ఇష్టానికి ఉద్యోగాలను తీసేస్తానంటే కుదరదని చంద్రబాబు హెచ్చరించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఫైటింగ్ చేయాలా? ఎవరు చేయాలి? ఎలా చేయాలి? అదేం తెలీదు కానీ డొనాల్డ్ ట్రంప్ పై ఫైటింగ్ చేయాలని సిఎం చంద్రబాబునాయుడు పిలుపినిచ్చేసారు. మరికేం ఢిల్లీలో నరేంద్రమోడి కూడా ఫైటింగ్ చేసేందుకు సిద్ధమైపోతారేమో. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మన వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నాడట. అది కరెక్టు కూడా కాదట. ఉన్నపళానా ఉద్యోగాలు పీకేస్తే ఏమైపోవాలని ట్రంప్ పై మండిపడ్డారు.

అంతేకాకుండా హెచ్ 1 బి వీసాల పేరుతో రెస్ట్రిక్షన్లు పెట్టటం మంచిది కాదన్నట్లుగా చంద్రబాబు హితవుపలికారు. హెచ్ 1 బి వీసాల నిబంధనలను కఠినతరం చేయమన్నది పూర్తిగా వాళ్ళిష్టం. అంది వాళ్ల అంతరంగిక వ్యవహారం. తాను ఇపుడు అమలు చేస్తున్న నిబంధనలన్నీ మొన్నటి ఎన్నికల సమయంలో బహిరంగంగా ఇచ్చిన హామీలే. ట్రంప్ హామీలను మెచ్చే అక్కడి వాళ్ళు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ట్రంప్ వ్యవహారం నచ్చకపోతే అక్కడి పార్లమెట్, న్యాయస్ధానాలు, ప్రజలున్నారు చూసుకోవటానికి. మధ్యలో చంద్రబాబుకు వచ్చిన బాధేంటో అర్ధం కావటం లేదు. నిబంధనలను కఠినతరం చేయటమన్నది వాళ్ళ దేశం ఇష్టంమని కూడా చంద్రబాబు ఆలోచించలేదు.

ఇవేమీ ఆలోచించకుండానే అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న తెలుగు వాళ్ళ తరపున చంద్రబాబు నాయుడు ఫైటింగ్ కు సిద్ధపడుతున్నారు. అమెరికాలో కోల్పోతున్న ఉద్యోగాల కోసం మనం ఫైట్ చేయాలని చంద్రబాబునాయుడు పిలుపిచ్చారు. శుక్రవారం నాడు నెల్లూరులో మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తన ఇష్టానికి ఉద్యోగాలను తీసేస్తానంటే కుదరదని చంద్రబాబు హెచ్చరించారు.

ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో కూడా మనవాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బందులు వస్తున్నట్లు చెప్పారు. హెచ్ 1 బి వీసాలను ట్రంప్ రెస్ట్రిక్ట్ చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. దాంతో మన వాళ్లు బాధపడే పరిస్ధితులు వస్తున్నట్లు వాపోయారు. కాబట్టి అక్కడి ఉద్యోగాలకోసం మనం ఫైట్ చేయాలని పిలుపినిచ్చారు. ఉన్నపళంగా ఉద్యోగాల్లో నుండి తీసేయటం కరెక్ట్ కాదని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మన గవర్నమెంట్ కూడా టేకప్ చేస్తుందన్నారు.