Asianet News TeluguAsianet News Telugu

విభజించు పాలించు.....

మాల-మాదిగలు ప్రాంతాలను బట్టి చీలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అదే పద్దతిలో ఇపుడు కాపు-బలిజల వర్గీకరణ మొదలైనట్లే ఉంది.

Naidu divide and rule over Kapu agitation

విభజించు పాలించు సూత్రాన్ని చంద్రబాబు పక్కాగా అమలు చేస్తున్నారు. తమను బిసిల్లో చేర్చాలని ఉద్యమాలు చేస్తున్న కాపు సామాజిక వర్గంలో చీలకలు తేవటం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చాలని అధికార టిడిపి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 

ఇదే విషయమై ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న ముద్రగడ పద్మనాభం కూడా చంద్రబాబుపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

 

కాపులు-బలిజల మధ్య చీలకలు తేవటం ద్వరా ఉద్యమాన్ని పలుచన చేయాలని ప్రభుత్వ వ్యూహం పన్నుతోందని ముద్రగడ ఆరోపిస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో బలిజల జనాభా ఎక్కువ. కోస్తా జిల్లాల్లో కాపుల శాతం ఎక్కువ.

 

హోలు మొత్తం మీద చూస్తే ప్రాంతాలను బట్టి జనాభా శాతం మారుతుంది. అటువంటిది కాపు ఉద్యమం నుండి రాయలసీమలో బలిజలను విడదీయటానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

 

అందుకే, కాపులను బిసిల్లో చేర్చాలనే ఉద్యమం నుండి తాము విడిపోతున్నట్లు రాయలసీమకు చెందిన బలిజ నేతలు ఇటీవల బహిరంగంగా ప్రకటిచటం గమనార్హం. అంటే ఐదు జిల్లాల్లో కాపు ఉద్యమం నీరుగారి పోవటం ఖాయం.

 

ఎస్సీ వర్గీకరణలో మాల-మాదిగలు ప్రాంతాలను బట్టి చీలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అదే పద్దతిలో ఇపుడు కాపు-బలిజల వర్గీకరణ మొదలైనట్లే ఉంది.

 

ఇటీవలే తిరుపతిలో బలిజ నేతలందరూ కలిసి భవిష్యత్తులో బిసి ఉద్యమాలను విడిగానే నిర్వహించుకోవాలని అనుకున్నారు. అసలే, కాపు సామాజిక ఉద్యమాలను కొందరు కాపు నేతలే బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. టిడిపిలోని కాపు నేతలు ముద్రగడను బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

 

అటువంటి పరిస్ధితుల్లో కాపుల నుండి బలిజలను విడదీయటమంటే, ఉద్యమాన్ని నీరుగార్చటం తప్ప మరోకటి కాదు. దాంతో కాపుల ఉద్యమం బలహీన పడటం ఖాయంగా పలువురు భావిస్తున్నారు. పైగా తూర్పుగోదావరి జిల్లాలోని పలువరు ముద్రగడ అనుచరులపై తుని రైలు దహనం కేసు ఎటూ ఉండనే ఉంది. రాబోయే రోజుల్లో కాపు ఉద్యమం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios