కాపుల ఉద్యమాన్ని చంద్రబాబునాయుడు అణిగదొక్కేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే ముందు కాపు నేతల్లో చీలికలు తెచ్చారు. మొన్న జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఫలితం టిడిపికి అనుకూలంగా రావటంతో రెండో అంకానికి తెరలేపారు. అదేంటంటే, బలిజ, ఒంటరి, తెలగ కులాలను మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ (ఎంబిసి)లకు ఉద్దేశించిన సంక్షేమ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావటం. కాపులను బిసిల్లోకి చేర్చాలంటూ ముద్రగడపద్మనాభం చేస్తున్న ఆందోళన నుండి రాయలసీమ బలిజలను వేరు చేసారు. అందుకే కాపుల ఉద్యమాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా బలిజలు ఆమధ్య ప్రకటనలు కుడా  చేసారు.

కాపుల ఉద్యమాన్ని చంద్రబాబునాయుడు అణిగదొక్కేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. అందులో భాగంగానే ముందు కాపు నేతల్లో చీలికలు తెచ్చారు. మొన్న జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఫలితం టిడిపికి అనుకూలంగా రావటంతో రెండో అంకానికి తెరలేపారు. అదేంటంటే, బలిజ, ఒంటరి, తెలగ కులాలను మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ (ఎంబిసి)లకు ఉద్దేశించిన సంక్షేమ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావటం. దీని వల్ల చంద్రబాబుకు పెద్ద ప్రయోజనమే సిద్ధించబోతోంది. ఏమిటంటే, ఇప్పటికే కాపులు-బలిజల మధ్య పెద్ద సయోధ్య లేదు. కోస్తా జిల్లాల్లో కాపుల ప్రాబల్యమెలాగో, రాయలసీమ జిల్లాల్లో బలిజల ప్రభావం అంతుంటుంది.

అందుకే, కాపులను బిసిల్లోకి చేర్చాలంటూ ముద్రగడపద్మనాభం చేస్తున్న ఆందోళన నుండి రాయలసీమ బలిజలను వేరు చేసారు. అందుకే కాపుల ఉద్యమాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా బలిజలు ఆమధ్య ప్రకటనలు కుడా చేసారు. దాంతో కాపుల ఉద్యమం సగం నీరుగారిపోయింది.

దానికితోడు మొన్న విజయవాడలోనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కాపు నేతలతో ఓ సమావేశం ఏర్పాటు చేయించారు. సమావేశంలో మాట్లాడిన వాళ్ళంతా తమకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు చాలని, రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదంటూ మాట్లాడారు. ఆ మేరకు ఓ తీర్మానం కుడా చేసారు. అంటే ఎన్ని రకాలుగా వీలుంటే అన్నిరకాలుగాను ముద్రగడ ఉద్యమాన్ని అణగదొక్కేస్తున్నారు. అందులో చంద్రబాబును తప్పు పట్టటానికేంలేదు. ముఖ్యమంత్రి స్ధానంలో ఎవరున్నా అదే పనిచేస్తారు లేండి.

చంద్రబాబు తన ప్రయత్నాల్లో ఉండగనే కాకినాడ ఎన్నిక జరిగింది. దాంతో కాపుల్లో ముద్రగడ మాట చెల్లటం లేదన్న సంకేతాలు వచ్చాయి. అందుకని కాస్త ధైర్యంతో కాపు-బలిజలను విడదీయటానికి చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగమే ఎంబిసి కార్పొరేషన్లోకి బలిజ, ఒంటరి, తెలగలను చేర్చటం. నిజానికి కాపులను బిసిల్లోకి చేరుస్తానని హామీ ఇచ్చిందే చంద్రబాబు. హామీ ఇవ్వటమే తన చేతిలో ఉంది కానీ అమలు చేయమన్నది చంద్రబాబు చేతిలో లేదు. హామీ అమలు చేయాలంటే బోలెడు రాజ్యాంగబద్దమైన వ్యవహారాలు అడ్డువస్తాయి. అందుకనే హామీ అమలుకు కమీటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు.

అయితే, ఈ ఎత్తులు ఎంతో కాలం సాగవు. ఆ విషయం చంద్రబాబుకూ తెలుసు. అందుకనే వచ్చే ఎన్నికల్లోగా కాపులను, బలిజలను విడదీస్తేగానీ మళ్ళీ ఎన్నికలను ఎదుర్కోవటం సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతోనే బలిజ, ఒంటరి, తెలగలను ఎంబిసి కార్పొరేషన్లో కలపటం. నిజానికి బలిజలు ఎంబిసి పరిధిలోకి రారు. ఎందుకంటే, బలిజలు ఓసిలు. అటువంటిది ఎంబిసి కార్పొరేషన్ పరిధిలోకి బలిజలను తీసుకురావటమన్నది ఆశ్చర్యంగా ఉంది.