చాలాకాలం తర్వాత చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా విజయవాడ పాత బస్టాండ్ వద్ద ఉన్న పార్క్ ను సందర్శించారు. ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు నాయుడు పాతబస్టాండ్ లోపలికి వెళ్లి అక్కడి పారిశుధ్య పరిస్ధితిని స్వయంగా పరిశీలించారు.

 

 

ఆకస్మికతనిఖీల్లో ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు,కృష్ణా కలెక్టర్, మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పండిట్ నెహ్రూ బస్టాండు నుంచి బయలుదేరి ఏలూరు రోడ్డు మీదుగా మాచవరం ప్రాంతంలోని రోడ్ల పరిస్ధితిని, స్వచ్ఛతే సేవ కార్యక్రమాల అమలును పరిశీలిస్తున్నారు.