వీరిద్దరి సమావేశంలో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించే చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు పార్టీల మధ్య వచ్చే ఎన్నికలకు పొత్తు లేకుంటేనే బాగుంటుందని ఇరు పార్టీల నేతల్లోనూ ఉంది. అదే విషయాన్ని భాజపా నేతలు తరచూ చెబుతున్నారు. అయితే, టిడిపి నేతలు మాత్రం నేరుగా ప్రస్తావించటం లేదు.

విజయవాడలో గురువారం మధ్యహ్నం చంద్రబాబునాయుడు-అమిత్ షాల మధ్య విందు సమావేశం జరగబోతోంది. ఇద్దరూ కలవటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. నిజానికి అమిత్ షాను చంద్రబాబు హైదరాబాద్ లోనే ఈరోజే కలవాలని అనుకున్నారట. అయితే, అమిత్ షా బిజీ కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదు.

కొంత కాలంగా ఇరు పార్టీల మధ్య సఖ్యత లోపించిందన్నది వాస్తవం. జగన్-మోడి భేటీ తర్వాత పార్టీల సంబంధాలు మరింత క్షీణించాయి. దానికితోడు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటిరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఇటీవల ప్రచారం బాగా చేస్తున్నారు. దానికి తగ్గట్లే ఢిల్లీ పరిణామాలు కూడా ఊతమిస్తున్నాయి. ఈ పరిస్ధాతుల్లో అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనను ఈరోజుతో ముగించుకుని రేపు విజయవాడ సమావేశంలో పాల్గొంటారు.

వీరిద్దరి సమావేశంలో ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించే చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు పార్టీల మధ్య వచ్చే ఎన్నికలకు పొత్తు లేకుంటేనే బాగుంటుందని ఇరు పార్టీల నేతల్లోనూ ఉంది. అదే విషయాన్ని భాజపా నేతలు తరచూ చెబుతున్నారు. అయితే, టిడిపి నేతలు మాత్రం నేరుగా ప్రస్తావించటం లేదు. అయితే, ఢిల్లీ పరిణామాలు, మూడు రోజుల్లో అమిత్ మాట్లాడిన మాటలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపితో భాజపా పొత్తు అనుమానమే. ఈ నేపధ్యంలోనే వీరిద్దరి సమావేశం అందరిలో ఉత్సుకత రేపుతోంది.