నంద్యాలలో పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ చంద్రబాబునాయుడు, మంత్రి అఖిలప్రియ వ్యూహాత్మకంగా సెంటిమెంటును రాజేస్తున్నారు. తమ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతూ, అభ్యర్ధికి తల్లి, తండ్రి లేరని, అనాధని, సంప్రదాయానికి విరుద్ధంగా వైసీపీ పోటీ పెట్టిందని చెప్పటం విచిత్రంగా ఉంది. చంద్రబాబు తన ప్రసంగంలో అదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి భూమా బ్రహ్మానందరెడ్డి ఏ విధంగా వారసుడో ఎవరికీ అర్ధం కావటం లేదు.

భూమా నాగిరెడ్డి దంపతులకు అఖిలప్రియ వారుసురాలు. అఖిలప్రియ వారసత్వ హోదాలో ఇప్పటికే రెండుసార్లు లబ్దిపొందింది. తల్లి శోబానాగిరెడ్డి మరణంతో ఆళ్ళగడ్డ నుండి ఎంఎల్ఏగా ఎన్నికైన అఖిల భూమా నాగిరెడ్డి మృతితో మంత్రీ అయ్యిపోయింది. ఇక భూమా బ్రహ్మానందరెడ్డిని వారసుడని చంద్రబాబు చెప్పటంలో అర్ధమేంటి? నాగిరెడ్డి అన్న భూమా వీరశేఖరరెరడ్డి కొడుకు బ్రహ్మానందరెడ్డి. అంతేగానీ నాగిరెడ్డికి కొడుకు కాదు.
ఇంతచిన్న విషయం తెలీక కాదు వారసుడని, అనాధని బ్రహ్మానందరెడ్డి గురించి చెబుతున్నది. కేవలం సెంటిమెంటును రగల్చటం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలన్న ప్రయత్నం తప్ప ఇంకేమీ కనబడటం లేదు. అయినా వాడుకుని అవసరం తీరాక వదిలేయటంలో ఘనమైన రికార్డున్న చంద్రబాబు కూడా సెంటిమెంటు గురించి మాట్లాడితే ఎవరు వింటారబ్బా?
ఇక, అఖిలప్రియ వయస్సులో బాగా చిన్నదైనా సెంటిమెంటును పండించటంలో చంద్రబాబుకన్నా నాలుగాకులు ఎక్కువే చదవినట్లుంది. అందుకే తన తండ్రి మరణానికి వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డే కారణమని చెప్పింది. ఈ విషయాన్ని ఇంతకాలం అఖిల ఎప్పుడూ ప్రస్తావించలేదు. 21వ తేదీతో ప్రచారం ముగుస్తోంది కాబట్టే పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తోంది.
అయితే, నాగిరెడ్డి మృతికి శిల్సా ఏ విధంగా కారణమో మాత్రం చెప్పటం లేదు. అంటే సెంటిమెంటుకు పడిపోయే జనాలెవరైనా ఉంటే నాగిరెడ్డి చావుకు కారణమైన శిల్పా మోహన్ రెడ్డికి ఓట్లు వేయటం మానుకుంటారని అఖిలమ్మ ఉద్దేశ్యం కావచ్చు. ఒక వైపేమో తమ అభ్యర్ధి ఎప్పుడో గెలిచేసాడిని చెబుతూనే ఇంకోవైపు సెంటిమెటును రగిల్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్లబ్బా?