విజయవాడ: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని  రాష్ట్ర పోలీస్ హౌసింగ్  కార్పోరేషన్ ఛైర్మెన్ నాగుల్ మీరా  ఆరోపించారు. పార్టీ నిబంధనావళిని పట్టించుకోవడం లేదని  ఆయన చెప్పారు.

నాగుల్ మీరా   ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తన కుమార్తెతో కలిసి జలీల్‌ఖాన్ భేటీ కావడంలో  తప్పు లేదన్నారు. అయితే  తన కూతురే  వచ్చే ఎన్నికల్లో  పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.  ఈ విషయమై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు.

అభ్యర్తుల ప్రకటనకు సీఎం చంద్రబాబునాయుడు  కసరత్తు చేస్తున్నారని  ఆయన చెప్పారు. అయితే  సీఎం ఏ నిర్ణయం తీసుకొన్న తమకు అభ్యంతరం లేదన్నారు. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. కానీ, జలీల్‌ఖాన్  టీడీపీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఆయన తప్పుబట్టారు.