కడప: కారులో నుండి  జిలెటిన్ స్టిక్స్‌ అన్‌లోడ్ చేసే సమయంలో   పేలుడు చోటు చేసుకొందని  కడప ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని మామిళ్లపల్లెలో పేలుడు ఘటనకు సంబంధించి క్వారీ యజమాని నాగేశ్వర్ రెడ్డితో పాటు అక్కడ పనిచేసే రఘునాథరెడ్డిని కూడ అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ చెప్పారు. 

also read:మామిళ్లపల్లె బ్లాస్ట్ కేసు: క్వారీ లీజుదారుడు నాగేశ్వర్ రెడ్డి సహా ఐదుగురిపై కేసు

పులివెందుల నుండి  కారులో జిలిటెన్ స్టిక్స్ ను  తరలించారన్నారు. కారులో వెయ్యికి పైగా పేలుడు పదార్ధాలున్నాయన్నారు. ఈ జిలెటిన్ స్టిక్స్ తరలించడానికి ఎలాంటి అనుమతి లేదన్నారు. అనుమతులు లేకుండానే  క్వారీలో తవ్వకాలు చేపట్టినట్టుగా ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరికొందరిని విచారించనున్నట్టుగా ఆయన తెలిపారు. మామిళ్లపల్లెలోని క్వారీలో పేలుడు చోటు చేసుకోవడం వల్ల  10 మంది కూలీలు మరణించారు. ఈ ఘటనపై ఐదు  ప్రభుత్వ శాఖలతో రాష్ట్ర ప్రభుత్వం  విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.