గత ఎన్నికల్లో ఆ స్థానానికి టీడీపీ నుంచి గాలి ముద్దు కృష్ణమ నాయుడు పోటీచేయగా.. వైసీపీ నుంచి రోజా పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. రోజాకి పోటీగా.. ఈ ఏడాది ఎవరిని నియమిస్తారా అనే విషయం టీడీపీలో చర్చనీయాంశమైంది. 

చిత్తూరు జిల్లా ‘నగరి’ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎవరు పోటీచేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో ఆ స్థానానికి టీడీపీ నుంచి గాలి ముద్దు కృష్ణమ నాయుడు పోటీచేయగా.. వైసీపీ నుంచి రోజా పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. రోజాకి పోటీగా.. ఈ ఏడాది ఎవరిని నియమిస్తారా అనే విషయం టీడీపీలో చర్చనీయాంశమైంది.

కొద్ది కాలం క్రితం ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ టికెట్ దక్కించుకునేందుకు చాలా మంది ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఆ టికెట్ ను ముద్దుకృష్ణమ కుటుంబసభ్యులలో ఒకరికి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ఆయన కుటుంబసభ్యులు సోమవారం చంద్రబాబుని కలిశారు.

నగరి టికెట్ తమ కుటుంబలో ఎవరికి ఇచ్చినా కలసి పనిచేస్తామని, టికెట్ వేరవారికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు గాలి కుటుంబసభ్యులు తెలిపారు

నగరి టికెట్ వివాదంపై నియోజకవర్గం నేతలందరితో శనివారం సీఎం సమావేశమయ్యారు. గాలి కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు నగరి ఇన్‌చార్జ్‌గా ఉండేలా మాట్లాడుకుని రావాలని లేని పక్షంలో వేరే వారికి ఇన్‌చార్జ్ పదవి ఇస్తాను అని చంద్రబాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాలి ముద్దుకృష్ణమ శిష్యుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నిన్న ముద్దుకృష్ణమనాయుడు కుటుంబీకులతో సమావేశమయ్యారు. ఈ చర్చలో భాగంగా కుటుంబంలో ఒకరు ఇన్‌చార్జ్‌గా ఉండేలా అంగీకారం కుదిరింది. తమ కుటుంబంలో ఎవరు ఇన్‌చార్జ్‌గా ఉన్నా, బయటవారికి టికెట్ ఇచ్చినా..రానున్న ఎన్నికల్లో నగరి స్థానాన్ని టీడీపీకి దక్కేలా చేస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.