చిత్తూరు జిల్లా (chittoor district) నగరి వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే రోజా (roja) …దత్తత తీసుకున్న బాలిక నీట్‌‌లో (neet) సత్తా చాటింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టులో (national eligibility entrance test) ఆ బాలిక అద్భుత ప్రతిభను చూపింది

చిత్తూరు జిల్లా (chittoor district) నగరి వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే రోజా (roja) …దత్తత తీసుకున్న బాలిక నీట్‌‌లో (neet) సత్తా చాటింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టులో (national eligibility entrance test) ఆ బాలిక అద్భుత ప్రతిభను చూపింది. నీట్‌లో 89 శాతం మార్కులు సాధించి.. తన పుట్టినరోజుకు కానుక ఇచ్చిందని రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాలికతో దిగిన ఫొటోలు పంచుకున్నారు. 

వివరాల్లెకి వెళితే.. పుష్పకుమారి (pushpa kumari) అనే బాలిక చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథ అయ్యింది. తిరుపతిలోని గర్ల్స్ హోమ్‌లో వుంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో గతేడాది ఎమ్మెల్యే రోజా గర్ల్స్ హోమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి పుష్పతో మాట్లాడారు. తనకు చదువుకోవాలని ఉందని కానీ తల్లిదండ్రుల అండ లేకపోవడం, ఆర్థిక స్థోమత లేకపోవడంతో వీలు కావడం లేదని రోజాతో ఆ చిన్నారి చెప్పింది. 

దీనిపై చలింపోయిన రోజా .. సీఎం జగన్ (ys jagan) జన్మదినం సందర్భంగా గతేడాది డిసెంబర్ 21వ తేదీన పుష్పను దత్తత తీసుకున్నారు. ఎంబీబీఎస్ చదివించడానికి అవసరమైన ఖర్చును భరిస్తానని అప్పుడే రోజా హామీనిచ్చారు. రోజా చేసిన పనిని పార్టీలకు అతీతంగా పలువురు చాలా మంది ప్రసంశించారు. ఇప్పుడు రోజా నమ్మకాన్ని నిజం చేస్తూ పుష్ప నీట్‌లో సత్తా చాటింది. దాదాపు 89 శాతం మార్కులను సాధించి శెభాష్ అనిపించుకుంది. ఈ విషయం తెలుసుకున్న రోజా.. ఆ బాలిక తనకు పుట్టిన రోజు కానుక ఇచ్చిందంటూ చెప్పారు. ఈ సందర్భంగా.. తన కుటుంబసభ్యులతో పుష్ప దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు రోజా.


Scroll to load tweet…