ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు మద్దతుగా నిలిచారు. మొన్నటి వరకు నా ఛానెల్ నా ఇష్టం పేరిట యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి... చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ ని టార్గెట్ చేసిన నాగబాబు... సడెన్ గా ప్లేట్ మార్చారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల విడుదలైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో... టీడీపీ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు.  చంద్రబాబుని కించపరిచేలా కామెంట్స్,, రకరకాల మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా..దీనిపై తాజాగా నాగబాబు స్పందించారు.

ఛంద్రబాబును విమర్శించడం సరికాదని అన్నారు. ట్విట్టర్ వేదికగా.. ‘చంద్రబాబు గారు మన ex సీఎం..ఇప్పుడు defeat అయినంత మాత్రాన ఆయన్ను దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్ లో ఉండగా విమర్శించటం వేరు. ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం.. ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలి. అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక శాడిజం’ అని ట్వీట్ చేశారు. 

అయితే, నాగబాబు ట్వీట్‌పైనా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రత్యర్థిగా ఉన్న సమయంలో మీ తమ్ముడు పవన్ తిట్టాడు కదా స్వామీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  టీడీపీ, జనసేన ఒకటేనని ప్రజల్లోకి వెళ్లిందని, దాని ఫలితమే వైసీపీ గెలుపు అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఒకటేనని ప్రత్యర్థులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని, టీడీపీని వదిలేసి జనసేన భవిష్యత్తు కార్యక్రమాలపై దృష్టిపెడితే మంచిదని సూచిస్తున్నారు.