మెగా బ్రదర్ నాగబాబు.. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి.. పొలిటికల్ లీడర్స్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. ఆయన ఓ స్కిట్ చేసి.. దానిని తన యూట్యూబ్ లో పోస్టు చేశారు. చంద్రబాబు, లోకేష్, జగన్ లను టార్గెట్ చేస్తూ.. ఈ వీడియో తీయడం విశేషం. జబర్దస్త్ లో నటించే ఇద్దరు నటులతో ఈ స్కిట్ చేయించారు. బ్యాంకాక్ లో జరిగిన యదార్ధఘటనల ద్వారా ఈ స్కిట్ తీసామంటూ నాగబాబు చెప్పారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే...

ఓ చిన్నపిల్లాడు స్వామీజీ వేషంలో కూర్చోగా.. రైజింగ్ రాజు.. బయోపిక్ అంటే ఏంటి స్వామి అని అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు.. ఎలక్షన్స్ కోసం చేసే పిక్ నే బయోపిక్ అంటారు నాయనా’ అని సమాధానం చెప్పాడు. ఇటీవల ఎన్టీఆర్, వైఎస్ బయోపిక్ లు థియేటర్లలో విడుదలయ్యి సందడి చేసిన సంగతి తెలిసిందే.. దానికి సెటైరికల్ గా ఈ ప్రశ్నను ఈ స్కిట్ లో వాడారు.

‘పప్పు అంటే ఎవరు స్వామి అంటే.. తను ఒకటి మాట్లాడాలనుకుంటే దేవుడు ఆయనతో ఇంకోటి మాట్లాడిస్తాడు తననే పప్పు అంటారు నాయనా’ అని ఇన్ డైరెక్ట్‌గా లోకేష్ బాబుకి పంచ్‌లు వేశారు. వీటితో పాటు.. పోలవరం ప్రాజెక్ట్ పైన పంచ్ పేల్చారు. జగన్ పాదయాత్ర పై కూడా పంచ్ లు వేయడం గమనార్హం. టీడీపీ, వైసీపీలకు మద్దతుగా నిలిచే పత్రికలు, జర్నలిస్టులపై కూడా ఈ స్కిట్ లో పంచ్ లు వేశారు. 

కాగా.. నాగబాబు పెట్టిన వీడియోకి పాజిటివ్ గా కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా రావడం గమనార్హం. నాగబాబు, చిరంజీవి, పవన్ లను టార్గెట్ చేస్తూ.. నెటిజన్లు వీడియో కింద కామెంట్స్ పెడుతున్నారు. నాగబాబు పెట్టిన పూర్తి వీడియో కింద చూడండి