Asianet News TeluguAsianet News Telugu

ఒరేయ్ రాస్కెల్స్ అంటూ తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలపై నాగబాబు సంచలనం


దమ్ముంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలపై స్పందించాలని నాగబాబు సవాల్ విసిరారు. తమకు కేసీఆర్ అంటే భయం లేదన్నారు. తాము కేసీఆర్ ని గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ఐడోంట్ కేర్ కేసీఆర్ అంటూ నాగబాబు స్పష్టం చేశారు. 

Nagababu makes sensationa comments on Telangana students suicides
Author
Visakhapatnam, First Published May 2, 2019, 1:41 PM IST

విశాఖపట్నం: జనసేన పార్టీ నర్సాపురం లోక్ సభ అభ్యర్థి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా ఉక్కునగర్ లో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న నాగబాబు తన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ పార్టీలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిట్టాడా మీ జోలికి వచ్చాడా అంటూ విరుచుకుపడ్డాడు. ఒరేయ్ రాస్కెల్స్ తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణిస్తే ఒక్క యెధవ మాట్లాడలేదు అంటూ విరుచుకుపడ్డారు. 

విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అక్కడ పోరాటం చేసింది, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది జనసైనికులు, శంకర్ గౌడ్ అంటూ నాగబాబు స్పష్టం చేశారు. అది జనసేన స్పిరిట్ అంటూ ఆవేశంతో రగిలిపోయారు నాగబాబు.

 తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనత, ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నాగబాబు ఆరోపించారు. దాన్ని ప్రశ్నించేందుకు ఈ షోకాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ నాయకులకు ధైర్యం లేదు కానీ పవన్ కళ్యాణ్ ని మాత్రం తిడతారా అంటూ విరుచుకుపడ్డారు నాగబాబు. 

ఎవరు ఎన్ని చేసినా ఎక్కడైనా ప్రజలపక్షాన పోరాడే ధైర్యం దమ్ము ఒక్క జనసేన పార్టీకే ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పోరాడింది కూడా జనసైనికులేనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి కానీ స్పందించలేదన్నారు. 

అది పక్కరాష్ట్రం సమస్యలా చూశారని కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి జగన్ చాలా గొప్పగా మాట్లాడతాడని విమర్శించారు. ఇప్పుడా లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం అంటూ నిలదీశారు. తాగునీటి సమస్యలు ఉన్నాయి, పొల్యూషన్ సమస్యలు, తినే తిండి లేక ప్రజలు బాధపడుతున్నారని వాటిపై స్పందించాలన్నారు. 

దమ్ముంటే ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలపై స్పందించాలని నాగబాబు సవాల్ విసిరారు. తమకు కేసీఆర్ అంటే భయం లేదన్నారు. తాము కేసీఆర్ ని గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ఐడోంట్ కేర్ కేసీఆర్ అంటూ నాగబాబు స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రాబోయేది జనసేన ప్రభుత్వమే: నాగబాబు ధీమా

Follow Us:
Download App:
  • android
  • ios