‘ఆ వెధవను మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు’..సజ్జలకు నాగబాబు కౌంటర్..
అన్యం సాయి జనసేన కార్యకర్త అని సజ్జల చేసిన కామెంట్స్ కు కౌంటర్ కు జనసేన నేత నాగబాబు కౌంటర్ వేశారు.
హైదరాబాద్ : Konaseema జిల్లా పేరు మార్పు వ్యవహారంతో andhrapradesh రాజకీయాలు వేడెక్కాయి. ఈ విధ్వంసం వెనుక టిడిపి, Janasena Party హస్తముందని వైఎస్ఆర్సీపి అంటుంటే.. కాదు, కాదు అధికార పార్టీనే అంటూప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ మధ్యలో ‘అన్యం సాయి’ అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. అమలాపురంలో జరిగిన అల్లర్ల వెనుక ఈయన హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సిపికార్యకర్త అని కొన్ని ఫొటోలు వైరల్ అవుతుండగా.. వైఎస్ఆర్ సీపీ మాత్రం అతడు జనసేన పార్టీ కార్యకర్త అంటూ కొన్ని ఫోటోలను బయటపెట్టింది. వైఎస్ఆర్ సీపీ నేత Sajjala Ramakrishnareddy కూడా ఆరోపణలు చేశారు.
అన్యం సాయిపై సజ్జల చేసిన ఆరోపణలకు జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘మాతో ఫోటోలు తీయించుకున్న ఇలాంటి వెధవల్ని మీ వైసీపీ పార్టీలో చేర్చుకుని... ఇలాంటి విధ్వంసకరమైన పనులు చేస్తున్న మిమ్మల్ని, మీ పార్టీని ఏమనాలి సజ్జల? హలో మిస్టర్ సజ్జల.. మరి ఇటీవలే ఆ వెధవ మీతో దిగిన ఈ ఫోటోలకు మీరు ఏమని సమాధానం చెబుతారు. కొంచెం సంకుచిత ధోరణి విడనాడి విశాల దృక్పథంతో పని చేయండి. కులాల మధ్య చిచ్చులు పెట్టే నీచ రాజకీయాలు ఇకనైనా మానుకోండి. అమలాపురం ప్రజలందరికీ.. విన్నపం. మీరందరూ దయచేసి సంయమనం పాటించి ఇలాంటి వైసిపి కుట్రలకు మీరు బలి కావొద్దని నా విజ్ఞప్తి’.. అంటూ ట్వీట్ చేశారు.
మంగళవారం అమలాపురంలో విధ్వంసం వెనుక సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారట. అందుకే అతడిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. సాయిని పోలీసులు ప్రశ్నిస్తున్నారట. గతంలోనే అతడిపై రౌడీషీట్ కూడా ఉందంటున్నారు. ఈ సాయి విషయంలోనే నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సాయి వైఎస్ఆర్సిపి కార్యకర్త అంటూ సజ్జలతో దిగిన ఫోటోలు వైరల్ చేస్తున్నారు. అలాగే మంత్రి విశ్వరూప్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బయటకు వచ్చాయి.
దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అల్లర్ల కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని… అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితులు అన్యం సాయి మిగతా వాళ్ళతోనూ ఫోటోలు దిగడం, అన్యం సాయి జనసేన కార్యకర్త అని ఆయన ఆరోపించారు. అతడు జనసేన నేతలతో ఉన్న ఫోటోలను ఉన్నాయని.. సాయి మిగతా వాళ్ళతోనూ ఫోటోలు దిగాడని చెప్పుకొచ్చారు. విపక్ష నేతలవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలు అని… టిడిపి, pawan, బిజెపి ఒకే ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
ఇదంతా చూస్తుంటే ప్లాన్ ప్రకారమే చేశారని తమకు కనిపిస్తోందన్నారు. టిడిపి స్క్రిప్టే పవన్కళ్యాణ్ చదివారని ఆయనకు కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలని టిడిపి, జనసేన కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల నుంచి అభ్యర్థులు వచ్చాయని.. అందుకే పేరు పై అభ్యంతరాలు నమోదుకు గడువు ఇచ్చామని సజ్జల అంటున్నారు. మొత్తం మీద కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.